📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం నేడు డెలివరీ గిగ్ వర్కర్ల సమ్మె లోయలో పడిన బస్సు, 7 మంది మృతి ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురి మృతి! పాన్-ఆధార్ లింక్ వీరికి తప్పనిసరి కాదు! ఇతర రాష్ట్రాల వాహనాలకు రూ. 20 వేల వరకు జరిమానా భారత్ లో ధనిక చెఫ్ ఎవరంటే? ఉత్తర్ ప్రదేశ్‌ లో కోట్లాది ఓటర్లు తొలగింపు? ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం నేడు డెలివరీ గిగ్ వర్కర్ల సమ్మె లోయలో పడిన బస్సు, 7 మంది మృతి ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురి మృతి! పాన్-ఆధార్ లింక్ వీరికి తప్పనిసరి కాదు! ఇతర రాష్ట్రాల వాహనాలకు రూ. 20 వేల వరకు జరిమానా భారత్ లో ధనిక చెఫ్ ఎవరంటే? ఉత్తర్ ప్రదేశ్‌ లో కోట్లాది ఓటర్లు తొలగింపు?

Honeymoon Horror : భర్త హత్యకు ఆపై రూ.20లక్షలకు పెంపు

Author Icon By Divya Vani M
Updated: June 10, 2025 • 8:04 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తాజాగా మధ్యప్రదేశ్‌లో (In Madhya Pradesh) ఓ హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. రాజా రఘువంశీ అనే యువకుడిని హనీమూన్ ట్రిప్‌లో (On a honeymoon trip) హత్య చేసిన కేసులో ఆయన భార్య సోనమ్ పాత్రపై పెద్ద చర్చ జరుగుతోంది. ఇది సాధారణ హత్య కాదు, ప్రేమకోసం ముందుగానే ప్రణాళిక వేసిన శాడిస్టిక్ పథకం.పోలీసుల కథనం ప్రకారం, భర్తను హత్య చేయించేందుకు సోనమ్ మొదట నిందితులకు రూ.4 లక్షల సుపారీ ఆఫర్ చేసింది. కానీ వారు ఒప్పుకోకపోవడంతో ఆ మొత్తాన్ని రూ.20 లక్షల వరకు పెంచినట్టు సమాచారం.మే 11న సోనమ్, రాజా వివాహం జరిగింది. పెళ్లైన కొద్దికాలానికే ఆమె భర్తను మాయం చేయాలని నిర్ణయించుకుంది. బెంగళూరులో నిందితులను కలిసి పక్కా ప్లాన్ వేసింది. షిల్లాంగ్‌కు వెళ్లకపోయినా ఆమె ప్రియుడు ఈ కుట్ర వెనుక కీలకంగా ఉన్నాడు.మే 21న సోనమ్-రాజా జంట గువహటీకి వెళ్లింది. నిందితులు వారి వెంటనే షిల్లాంగ్ వచ్చారు. మే 23న జలపాతాల దగ్గరకు వెళ్లిన దంపతులను నిందితులు అనుసరించారు. అక్కడే రాజాను హత్య చేయాలని సోనమ్ సూచించినట్టు సమాచారం.

అలసిన నటనతో భర్తను ఫాలో అయ్యే దారిలోకి తీసుకెళ్లింది

ఆ రోజు సోనమ్ అలసిపోయినట్టు నటించి భర్త వెనక నడవడం ప్రారంభించింది. నిందితులు ముందు వెళ్లగా, సోనమ్ వారితో కలిసి భర్తను హత్య చేయాలనుకున్నట్టు తెలుస్తోంది.

హత్య అనంతరం మృతదేహాన్ని లోయలో తోసారు

రాజాపై తీవ్రంగా దాడి చేసి, తలపై గట్టిగా కొట్టారు. వెంటనే అతడు కూలిపోయాడు. అనంతరం మృతదేహాన్ని లోయలోకి తోసేశారు. దీనిలో సోనమ్ కూడా భాగమయ్యిందని సమాచారం.

సోషల్ మీడియాలో పోస్టులే ఆమెను దొరికేలా చేశాయి

జూన్ 2న మృతదేహం బయటపడింది. జూన్ 3న పోలీసులు సోనమ్‌పై అనుమానం వ్యక్తం చేశారు. భర్త ఫొటో లేకుండా సోనమ్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు కేసులో కీలక మలుపు తిప్పాయి.

Read Also : Piggy Bank : బురదలో దొరికిన ఓ వస్తువు అతడిని కోటీశ్వరుడిని చేసింది..

honeymoon murder Madhya Pradesh news murder case twist murder for lover Raja Raghuvanshi murder Rs. 20 lakh supari Shillong murder Sonam plan

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.