📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం

Adani Group: భారత విమానాశ్రయాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి

Author Icon By Tejaswini Y
Updated: December 19, 2025 • 4:40 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Navi Mumbai Airport Launch: భారత ఏవియేషన్ రంగంలో పెరుగుతున్న అవకాశాలను దృష్టిలో ఉంచుకుని, అదానీ గ్రూప్ (Adani Group) తమ విమానాశ్రయ వ్యాపారంలో భారీ పెట్టుబడులు చేసేందుకు సిద్ధంగా ఉంది. రాబోయే ఐదేళ్లలో సుమారు రూ.1 లక్ష కోట్లు పెట్టుబడిగా పెట్టనున్నట్లు అదానీ ఎయిర్‌పోర్ట్స్ డైరెక్టర్ జీత్ అదానీ వెల్లడించారు.

Read also: Smart Phones: వచ్చే ఏడాదిలో భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్ల ధరలు?

Adani Group: Rs. 1 lakh crore investment in Indian airports

అదానీ గ్రూప్ భారీ వృద్ధి ప్రణాళికలు

ఈ నెల 25న ప్రారంభం కానున్న నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం, రూ.19,650 కోట్ల వ్యయంతో నిర్మించబడింది. దీనిలో అదానీ గ్రూప్ 74 శాతం వాటా కలిగి ఉంది. మొదటి దశలో ఈ విమానాశ్రయం సంవత్సరానికి 2 కోట్ల మంది ప్రయాణికులకు సేవలు అందిస్తుంది. భవిష్యత్తులో సామర్థ్యాన్ని 9 కోట్ల మందికి పెంచాలని కంపెనీ భావిస్తోంది. ఇది ముంబై విమానాశ్రయంపై ఉన్న ప్రస్తుత భారాన్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషించనుంది.

భారత విమానాశ్రయాల ప్రైవేటీకరణలో అదానీ గ్రూప్ కీలక పాత్ర

జీత్ అదానీ(Jeet Adani) ప్రకారం, భారత ఏవియేషన్ రంగం వచ్చే 10-15 సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం 15-16 శాతం వృద్ధి సాధించే సత్తా ఉందని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ప్రైవేటీకరణ ప్రణాళికల్లో అదానీ గ్రూప్ దూకుడుగా పాల్గొని, 11 విమానాశ్రయాల కోసం బిడ్ చేసేందుకు సిద్దమని ఆయన తెలిపారు. ప్రస్తుతానికి ముంబై, నవీ ముంబైతో పాటు అదానీ గ్రూప్ అహ్మదాబాద్, లక్నో, గువాహతి, జైపూర్ వంటి ఇతర 6 విమానాశ్రయాలను నిర్వహిస్తోంది. దేశంలోని మొత్తం ప్రయాణికులలో దాదాపు 23 శాతం వారి ప్రయాణాలు అదానీ గ్రూప్ ఎయిర్‌పోర్ట్స్ ద్వారా జరుగుతున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read also :

Adani Airports Expansion Adani Airports Investment Adani Group Aviation India Aviation Sector Growth Navi Mumbai Airport Launch

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.