📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Actor Devan : BJPకి నటుడు దేవన్ రాజీనామా..

Author Icon By Sudheer
Updated: August 24, 2026 • 10:01 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Actor Devan : సినీ నటుడు, బీజేపీ కేరళ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దేవన్ ఆ పార్టీకి రాజీనామా చేసి, తమిళనాడు స్టార్ హీరో విజయ్ నేతృత్వంలోని ‘తమిళగ వెట్రి కళగం’ (TVK) పార్టీలో చేరేందుకు సమాయత్తమవుతున్నారు. 2021లో తన సొంత పార్టీని బీజేపీలో విలీనం చేసిన ఆయన, ప్రస్తుతం కేరళ బీజేపీ నాయకత్వ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. సమాజ సంస్కర్త శ్రీనారాయణ గురు ఆశయాలకు పార్టీ దూరమైందని, అక్కడి నేతలకు గెలవడం కంటే ఇతర ప్రయోజనాలపైనే ఎక్కువ ఆసక్తి ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో ఉంటే తన రాజకీయ లక్ష్యాలు నెరవేరవనే భావనతోనే ప్రాథమిక సభ్యత్వానికి స్వస్తి పలికినట్లు దేవన్ మీడియాకు స్పష్టం చేశారు.

Read Also : CJP మరో హెచ్చరిక

టీవీకే కేరళ బాధ్యతలు చేపట్టనున్న దేవన్: విజయ్‌తో త్వరలో భేటీ

బీజేపీకి వీడ్కోలు పలికిన అనంతరం దేవన్ రాజకీయ భవిష్యత్తుపై స్పష్టత వచ్చింది. TVK అధినేత విజయ్ ఆహ్వానం మేరకు ఆ పార్టీ ప్రతినిధులు దేవన్ నివాసానికి వెళ్లి కేరళ రాష్ట్రంలో పార్టీ విస్తరణ, బాధ్యతలపై ప్రాథమిక చర్చలు జరిపారు. కేరళలో TVK విభాగానికి నేతృత్వం వహించే అవకాశం దేవన్‌కు లభించనున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 10న చెన్నైలో విజయ్‌తో వ్యక్తిగతంగా సమావేశమై, పార్టీ తీర్థం పుచ్చుకోవడంతో పాటు కేరళ అధ్యక్ష బాధ్యతలపై అధికారిక ప్రకటన చేయనున్నారని తెలుస్తోంది. సౌత్ ఇండియాలో TVK ని విస్తరించే ప్రయత్నాల్లో కేరళలో ఈ చేరిక ప్రాధాన్యత సంతరించుకుంది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

Actor Devan Devan joins TVK Vijay party Kerala BJP vice president Devan Tamilaga Vettri Kazhagam Kerala unit

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.