📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ…

Telugu News: Acid Attack:ఢిల్లీ యాసిడ్ దాడి కేసులో అనూహ్య మలుపు

Author Icon By Pooja
Updated: October 27, 2025 • 4:01 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఢిల్లీలో ఓ యువతిపై జరిగిన యాసిడ్ దాడి(Acid Attack) దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ కేసుపై జాతీయ మహిళా కమిషన్ తీవ్రంగా స్పందించింది. నిందితులను వెంటనే అరెస్టు చేయాలని, బాధితురాలికి మెరుగైన వైద్యం, నష్టపరిహారం అందించాలని ఢిల్లీ పోలీసులను ఆదేశించింది. అయితే ఈ యాసిడ్ కేసు నేడు అనూహ్య మలుపు తిరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వ్యక్తి భార్య బాధితురాలి తండ్రిపైనే లైంగిక వేధింపుల(Sexual harassment), బ్లాక్మెయిల్ ఆరోపణలతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. గతంలో తాను ఆయన వద్ద పనిచేసేటప్పుడు తనను లైంగికంగా వాడుకుని, ప్రైవేట్ వీడియోలతో బ్లాక్ మెయిల్ చేశాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. ఊహించని మలుపుతో కేసు దర్యాప్తు మరింత సంక్లిష్టంగా మారింది.

Read Also: Viral News: పరువు తీశారు కదా! విదేశీ యూట్యూబర్‌పై పేడ చల్లిన వీడియో వైరల్

Acid Attack:ఢిల్లీ యాసిడ్ దాడి కేసులో అనూహ్య మలుపు

కాలేజీ విద్యార్థినిపై యాసిడ్ దాడి(Acid Attack) వాయవ్య ఢిల్లీలోని అశోక్ విహార్ లో 20ఏళ్ల కాలేజీ విద్యార్థినిపై ఆదివారం యాసిడ్ దాడి జరిగిన విషయం తెలిసిందే. లక్ష్మీబాయ్ కాలేజీ సమీపంలో మోటార్సైకిల్పై వచ్చిన ముగ్గురు యువకులు ఆమెను అడ్డగించారు. ప్రధాన నిందితుడు ఇషాన్యా సిడ్ బాటిల్ తీసుకురాగా, అర్మాన్ అనే మరో వ్యక్తి ఆమెపై యాసిడ్ విసిరాడు. ముఖాన్ని కాపాడుకునే ప్రయత్నంలో బాధితురాలి చేతులకు గాయాలయ్యాయి. కాగా బాధితురాలు, నిందితుడు ఇద్దరూ ముకుంద్ పూర్ ప్రాంతానికి చెందినవారేనని పోలీసులు తెలిపారు. కొన్ని నెలలుగా ఇషాన్ తన సోదరిని వేధిస్తున్నాడని, గత నెలలో ఆమె అతడిని నిలదీసిందని బాధితురాలి సోదరుడు మీడియాకు తెలిపాడు. ప్రస్తుతం బాధితురాలికి ప్రాణాపాయం లేదని వైద్యులు వెల్లడించారు.

కాగా దాడికి పాల్పడ్డ నిందితులు పరారీలో ఉన్నారు. వారికోసం పోలీసులు అన్వేషిస్తున్నారు. అయితే నిందితుడి భార్య ఆరోపణలను బాధితురాలి బంధువులు ఖండించారు. కేసును తప్పుదోవ పట్టించేందుకు కుట్ర చేస్తున్నారని వారు మండిపడుతున్నారు.

ప్రేమను నిరాకరిస్తే యాసిడ్ దాడులతో బెదిరింపులు

తాము ప్రేమిస్తే ఎదుటివారు కూడా ప్రేమించాల్సిందే. తమకు దక్కనివారిని అంతం చేయడమో లేదా అందవిహీనంగా చేయడమో లాంటి క్రూరమైన చర్యలు ఇటీవల బాగా పెరిగిపోతున్నాయి. ప్రేమ అనేది రెండువైపుల నుంచి సమ్మతి ఉండాలి. వన్సైడ్ ప్రేమ అసలు ప్రేమనే కాదు. ప్రేమ ఎప్పుడూ ఎదుటివారి క్షేమాన్నేకోరుతుంది కానీ కీడును కాదు. ఇలా కీడు చేసేవారిని ప్రేమికులు అనరు, ఉన్మాదులు అంటారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Delhi Crime justice for victims Today news women safety

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.