Abortion Verdict: గర్భస్రావంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

Read Time:  1 min
Abortion Verdict
Abortion Verdict
FONT SIZE
GET APP

గర్భస్రావానికి సంబంధించి సుప్రీంకోర్టు శుక్రవారం ఒక చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. పుట్టబోయే శిశువు హక్కులకన్నా, తల్లి పునరుత్పత్తి స్వేచ్ఛే ముఖ్యమని స్పష్టం చేసింది. మహిళ ఇష్టానికి విరుద్ధంగా గర్భాన్ని కొనసాగించమని ఎవరూ బలవంతం చేయలేరని ధర్మాసనం తేల్చిచెప్పింది. ఈ నేపథ్యంలో 30 వారాల గర్భంతో ఉన్న 18 ఏళ్ల యువతికి గర్భస్రావం చేయించుకునేందుకు అనుమతి ఇచ్చింది.

Read Also: Ola Uber Rapido Strike: రేపు దేశవ్యాప్త క్యాబ్ మరియు బైక్ టాక్సీల సమ్మె

Abortion Verdict

హైకోర్టు తీర్పును రద్దు చేసిన ధర్మాసనం

ఈ కేసు నేపథ్యాన్ని పరిశీలిస్తే, 17 ఏళ్ల వయసులో యువతి తన స్నేహితుడితో ఉన్న సంబంధం కారణంగా గర్భం దాల్చింది. ప్రస్తుతం ఆమె వయసు 18 ఏళ్లు కాగా, గర్భం 30 వారాలకు చేరుకుంది. గర్భస్రావం కోసం ఆమె బాంబే హైకోర్టును(Abortion Verdict) ఆశ్రయించగా, అక్కడి న్యాయస్థానం అనుమతి నిరాకరిస్తూ బిడ్డను ప్రసవించి దత్తతకు ఇవ్వాలని సూచించింది.

ఈ తీర్పును సవాలు చేస్తూ యువతి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. జస్టిస్ బీవీ నాగరత్న నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించింది. గర్భాన్ని కొనసాగించాల్సి వస్తే యువతి శారీరకంగా, మానసికంగా తీవ్ర ఒత్తిడికి గురవుతుందని కోర్టు అభిప్రాయపడింది. సామాజిక పరిస్థితుల కారణంగా ఆమె తీవ్ర అవమానాలను ఎదుర్కోవాల్సి వస్తుందన్న వాదనను కూడా పరిగణనలోకి తీసుకుంది.

మహిళ హక్కులపై స్పష్టమైన వ్యాఖ్యలు

గర్భస్రావం వల్ల యువతి ప్రాణాలకు ప్రమాదం లేదని మెడికల్ బోర్డు నివేదిక ఇచ్చిన అంశాన్ని ధర్మాసనం ప్రస్తావించింది. “పుట్టబోయే బిడ్డ ప్రయోజనాలా? లేక తల్లి ప్రయోజనాలా? అనే ప్రశ్న వచ్చినప్పుడు, తల్లి ఇష్టానికి వ్యతిరేకంగా గర్భాన్ని కొనసాగించమని కోర్టు బలవంతం చేయలేదు” అని జస్టిస్ నాగరత్న వ్యాఖ్యానించారు.

చట్టపరమైన మార్గాలు అందుబాటులో లేకపోతే, మహిళలు అక్రమ గర్భస్రావాల వైపు వెళ్లే ప్రమాదం ఉందని ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. చివరికి బాంబే హైకోర్టు తీర్పును కొట్టివేసి, యువతికి గర్భస్రావానికి(Abortion Verdict) అనుమతి ఇచ్చింది. భారత చట్టాల ప్రకారం 24 వారాల తర్వాత గర్భస్రావానికి కోర్టు అనుమతి తప్పనిసరి. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పు మహిళల హక్కుల పరిరక్షణలో కీలక మైలురాయిగా భావిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Pooja

రచయిత గురించి

Pooja

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.