లద్దాఖ్‌కు చెందిన 21ఏళ్ల అబిదా అఫ్రీన్ (Abida Afreen) మౌంట్ ఎవరెస్ట్ శిఖరాన్ని విజయవంతంగా అధిరోహించి చరిత్రలో తన పేరును దక్కించుకుంది. ముస్లిం యువతిగా (Muslim woman), లద్దాఖ్ ప్రాంతానికి చెందిన తొలి మహిళగా ఈ ఘనతను సాధించడం ప్రత్యేకత. ఆమె ప్రయాణం, సాహసం, సంకల్పం లక్షల మందికి స్ఫూర్తిగా నిలుస్తోంది.
చిన్న గ్రామం నుంచి శిఖరదేండి వరకు…
లద్దాఖ్ (Ladakh) ప్రాంతంలోని మారుమూల గ్రామమైన చుచోట్ షామా నుంచి వచ్చిన అబిదా అఫ్రీన్ (Abida Afreen), చిన్ననాటి నుంచి పర్వతాలు చూసే శ్రద్ధతో పెరిగింది. ఎనిమిదో తరగతిలో ఉన్నప్పుడు ఎన్సీసీలో చేరాను. అప్పుడు ఒక క్యాంప్, పదో తరగతిలో మరొక ఎస్సీసీ క్యాంప్‌నకు వెళ్లాను. తర్వాత నేను సీనియర్ డివిజన్లో చేరాను. ఈజేఎం కళాశాలలో చేరిన తర్వాత కూడా ఎన్సీసీలో కొనసాగాను. ఎన్‌సీసీ బీ సర్టిఫికేట్ పరీక్షల పొడిగింపు కారణంగా, నాకు ఎవరెస్ట్ యాత్రలో పాల్గొనే అవకాశం లభించింది. మీరు దాన్ని అదృష్టం లేదా విధి అని పిలుస్తారు.
ఎలిజెర్ జోల్డాన్ మెమోరియల్ కాలేజ్ విద్యార్థినిగా ప్రస్థానం
2024 ఆగస్టులో లేహ్‌లో జరిగిన ట్రయల్ తర్వాత అఫ్రీన్ ఎవరెస్ట్ యాత్రకు ఎంపికైంది. ఆమె దృఢ సంకల్పం, ధైర్యం శిఖరాన్ని అధిరోహించడానికి సాయపడ్డాయి. ఆమె పర్వత అధిరోహణ లద్ధాఖ్లోని చాలా మందికి యువతకు స్ఫూర్తినిచ్చింది. అఫ్రీన్ ప్రయాణం 2017లో జూనియర్ వింగ్ క్యాడెట్‌గా నేషనల్ క్యాడెట్ కార్ప్స్(ఎన్‌సీసీ)లో చేరినప్పుడు ప్రారంభమైంది. ఎన్‌సీసీ ‘బీ’ సర్టిఫికేట్ పరీక్షలు రాయలేకపోయింది. ఎందుకంటే ఆ సమయంలో ఆమె కళాశాలలో పరీక్షలు జరిగాయి. అందుకోసం బీ సర్టిఫికేట్ ఎగ్జామ్‌ను తర్వాత నిర్వహించాలని అభ్యర్థించింది.
శిక్షణా దశలో ఎదురైన సవాళ్లు
మౌంట్ ఎవరెస్ట్ ఎక్కుతున్న ప్రారంభంలో తనకు ఆత్మవిశ్వాసం లేకపోవడంతో శారీరక, మానసిక సవాళ్లు ఎదుర్కొన్నానని అబిదా అఫ్రీన్ తెలిపింది. ఈ క్రమంలో తాను చాలా భయపడ్డానని చెప్పింది. కానీ జీవితంలో ఏదైనా సాధించలేదనే చింతన లేకుండా ఉండడానికి పర్వతాన్ని అధిరోహించేందుకు ప్రయత్నించాలనుకున్నానని పేర్కొంది.
“ఫిజికల్ టెస్టు, పరుగు, బ్యాక్ ప్యాక్‌లతో లేకుండా రన్నింగ్, పుష్ అప్స్, చిన్ అప్స్, సిట్ అప్స్, ఇంటర్వ్యూల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేశారు. ఈ రౌండ్ తర్వాత నన్ను, ఇతరులను తదుపరి దశ ఎంపిక కోసం దిల్లీకి పిలిచారు. లేహ్ నుంచి చెరో నలుగురు అబ్బాయిలు, అమ్మాయిలు ఎంపికయ్యారు. కానీ దేశవ్యాప్తంగా దాదాపు 250 మంది క్యాడెట్లు పాల్గొన్నందున దిల్లీ ట్రయల్స్ మరింత తీవ్రంగా ఉన్నాయి. వారిలో ఎక్కువ మంది అథ్లెట్లు, కిక్ బాక్సర్లు, జాతీయ స్థాయి కబడ్డీ ఆటగాళ్లు ఉన్నారు. అప్పుడు నేను భయపడ్డాను. నేను ఎంపికయ్యే అవకాశం లేదనుకున్నాను. 100 శాతం నా శక్తి మేరకు కృషి చేశాను. ఆ పరీక్షల్లో 36 మంది క్యాడెట్లు ఎంపికయ్యారు. అందులో నేను ఉన్నాను. తదుపరి సవాలు ఉత్తరాఖండ్‌లోని 7,355 మీటర్ల ఎత్తులో ఉన్న మౌంట్ అబి గామిన్ యాత్ర. ఎవరెస్ట్ యాత్రకు ముందు ఇది చేశాం. అదే మా నిజమైన శిక్షణా స్థలం. మేము టెంట్లు వేయడం, భోజనం వండుకోవడం, కఠినమైన పర్వత పరిస్థితులలో ఎలా జీవించాలో నేర్చుకున్నాం. మేము భారీ రక్ సాక్స్లతో చాలా దూరం నడిచేవాళ్లం” అని అఫ్రీన్ పేర్కొంది.
అత్యంత కఠినమైన శిక్షణ – సియాచిన్ గ్లేసియర్
అబి గామిన్ యాత్ర తర్వాత మళ్లీ అభ్యర్థులను ఫిల్టర్ చేశారు. 36 మంది 16 మంది క్యాడెట్లను మాత్రమే ఎంపిక చేశారు. వీరిని ఉత్తరాఖండ్‌లోని నెహ్రూ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మౌంటెనీరింగ్, డార్జిలింగ్‌లోని హిమాలయన్ మౌంటెనీరింగ్ ఇన్ స్టిట్యూట్లో అధునాతన శిక్షణ కోసం పంపించారు. ఆ తర్వాత అతి శీతలమైన సియాచిన్ సైనిక శిక్షణ క్షేత్రంలో శిక్షణ జరిగింది. “అది అత్యంత కష్టతరమైన భాగం. చలి వాతావరణం, బలమైన చలిగాలుల వల్ల మానసికంగా, శారీరకంగా అలసిపోయాం.
ఎత్తైన ప్రాంతం – సహజ ప్రయోజనం
ఎత్తైన ప్రదేశంలో కూడా పరిగెత్తించారు. సియాచిన్‌లో ప్రజలను ఎవరు పరిగెత్తిస్తారో అని నేను ఆశ్చర్యపోయాను. అక్కడ మానసికంగా చాలా ఇబ్బందిపడ్డాను. అక్కడ శిక్షణకే నేను అంత కష్టపడితే, ఎవరెస్ట్‌ను ఎలా అధిరోహించగలను అనుకున్నాను.
ఎవరెస్ట్ శిఖరంపై జాతీయ జెండా – కల నెరవేరిన రోజు
ఎవరెస్ట్‌ను అధిరోహించిన అనంతరం అబిదా మాట్లాడుతూ – “ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కుతున్నప్పుడు ఎప్పుడు ఇంటికి చేరుకుంటానో అని ఆలోచిస్తూనే ఉన్నాను. ఎందుకంటే మా ప్రయాణం శారీరకంగా, మానసికంగా అలసిపోయేలా ఉంది. కానీ మా కఠినమైన శిక్షణ బాగా పనిచేసింది. మా బృందం అంతా శిఖరాన్ని సురక్షితంగా చేరుకుని, అక్కడ జాతీయ జెండాను ఎగురవేసి, ఎటువంటి గాయాలు లేకుండా తిరిగి కిందికి చేరుకుంటామని నేను ముందే అనుకున్నాను. ఎవరెస్ట్ అధిరోహణతో నా కల నిజమైంది. నా జీవితం మారిపోయింది. ఎవరెస్ట్ ఎక్కడం వల్ల నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఇప్పుడు ఏదీ అసాధ్యం కాదని నమ్ముతున్నాను. నాలో భయాలన్నీ పోయాయి. సాయుధ దళాలలో చేరాలని ఆశపడుతున్నాను” అని అఫ్రీన్ తెలిపింది.
ఎన్‌సీసీ సహకారం – గుర్బీర్ పాల్ సింగ్ దార్శనికత
ఎవరెస్ట్ అధిరోహణ యాత్రకు ఎన్‌సీసీ డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ గుర్బీర్ పాల్ సింగ్ సాయపడ్డారని అఫ్రీన్ తెలిపింది. ఎన్‌సీసీ క్యాడెట్లను ఎవరెస్ట్ శిఖరానికి తీసుకెళ్లడం గుర్బీర్ పాల్ సింగ్ విజన్ వల్లే సాధ్యమైందని పేర్కొంది. ఆయన దార్శనికతను కమాండింగ్ ఆఫీసర్, టీమ్ లీడర్, సేన మెడల్ అవార్డు గ్రహీత కల్నల్ అమిత్ బిస్త్ ముందుకు తీసుకెళ్లారని వెల్లడించింది. అమిత్ బిస్త్ దేశవ్యాప్తంగా తిరిగి క్యాడెట్లను స్కౌట్ చేసి ఎంపిక చేశారని స్పష్టం చేసింది .
ఎవరెస్ట్ ఎక్కిన భారతీయుల సంఖ్య?
ఇప్పటివరకు ఎంత మంది భారతీయులు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారు. కేవలం 561 మంది .
Read hindi news: hindi.vaartha.com
Read also: Japan: జపాన్ నూతన ఆవిష్కరణ: ప్రపంచంలోనే వేగవంతమైన ఇంటర్నెట్ స్పీడ్