📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు

ఆప్ ఎమ్మెల్యే అనుమానాస్పద మృతి

Author Icon By Sudheer
Updated: January 11, 2025 • 6:46 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పంజాబ్‌లోని లూథియానా వెస్ట్ నియోజకవర్గ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యే గుర్రోత్ బస్సి గోగీ అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించారు. అర్ధరాత్రి 12 గంటల సమయంలో తన ఇంట్లో గన్‌షాట్‌కు గురైన ఆయనను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అయితే మార్గమధ్యంలోనే ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

ఈ ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు. ఆయన తన గన్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారా? లేదా ప్రమాదవశాత్తు మిస్‌ఫైర్ జరిగి చనిపోయారా? అన్న అనుమానాలపై స్పష్టత కోసం పోస్టుమార్టం నివేదిక కోసం ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. గన్‌షాట్ వివరాలు తెలుసుకునేందుకు ఎమ్మెల్యే ఇంటి పరిసరాలను పోలీసులు తనిఖీ చేశారు.

గుర్రోత్ బస్సి గోగీ అనారోగ్య సమస్యలు లేదా వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకునే అవకాశం ఉందా? లేక ఈ ఘటనకు వెనుక మరేదైనా కారణం ఉందా? అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ సభ్యులు ఇంకా ఈ విషయంలో అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.

గోగీ మృతితో లూథియానాలో రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. పంజాబ్ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ఆయన కుటుంబానికి సానుభూతి వ్యక్తం చేశారు. MLA గోగీ మృతి రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. పోస్టుమార్టం రిపోర్టు వచ్చిన తర్వాత మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

AAP Punjab MLA Gurpreet Gogi Bassi AAP Punjab MLA Gurpreet Gogi Bassi dies Gurpreet Gogi Bassi found dead

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.