📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Aadhaar: ఆధార్ అప్డేట్ కు డాక్యుమెంట్ వెరిఫికేషన్ తప్పనిసరి

Author Icon By Vanipushpa
Updated: July 11, 2025 • 5:30 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఏ వ్యక్తి అయినా తన గుర్తింపును సాక్ష్యంగా చూపాలంటే, ఆధార్ కార్డు(Aadhar Card) ఇక తప్పనిసరి. ప్రభుత్వ స్కీములు నుంచి బ్యాంకింగ్‌ వరకూ ప్రతి దశలో ఆధార్ అవసరం అయ్యే రోజుల్లో, ఐడెంటిటీని తప్పుగా వాడేవారికి చెక్ పెట్టేందుకు UIDAI (యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా) కొత్త నియమాలు తీసుకువస్తోంది. ఇప్పటిదాకా ఆధార్ పొందడం, అప్డేట్(Update) చేయడం సులువుగానే ఉండేది. కొన్ని పత్రాలు ఇచ్చినా చాలు, కొన్ని చోట్ల సైతం వెరిఫికేషన్ సడలింపుతో జరిగేది. కానీ ఇప్పుడు డేటా ఆధారంగా, సిస్టమాటిక్ వెరిఫికేషన్ తీసుకువచ్చే దిశగా UIDAI ముందడుగు వేసింది. కొత్తగా ఏం మారబోతుందంటే… 1. ఆధార్ తీసుకునే ప్రతి వ్యక్తి డేటా, డాక్యుమెంట్స్ ప్రభుత్వ డేటాబేస్‌లతో వెరిఫై అవ్వాలి.

Aadhar: ఆధార్ అప్డేట్ కు డాక్యుమెంట్ వెరిఫికేషన్ తప్పనిసరి

పూర్తిగా తనిఖీ జరుగుతుంది

అంటే మీరు ఆధార్ కోసం ఇచ్చే పాస్‌పోర్ట్, పాన్ కార్డు, రేషన్ కార్డు వంటి పత్రాలు అవి నిజమేనా లేదా అన్నదానిపై పూర్తిగా తనిఖీ జరుగుతుంది. 2. ఆధార్ అప్డేట్ చేయాలన్నా ఇప్పుడు కఠినమే. ఒకవేళ చిరునామా మారితే లేదా పుట్టిన తేదీ మారిస్తే కేవలం ఋజువులతో చెల్లదన్నమాట. ఆధారాలు ప్రభుత్వ రికార్డుల్లో క్రాస్ వెరిఫికేషన్ చేయబడతాయి. 3. ఒక్కో వ్యక్తికి ఒక్క ఆధార్ మాత్రమే ఉండాలి. ఇది తప్పనిసరి నిబంధన. అంటే డూప్లికేట్ ఆధార్‌లు ఉంటే రద్దు చేసే ప్రక్రియ మొదలవుతుంది. ఇది దేశంలో నకిలీ గుర్తింపులను పూర్తిగా తుడిచివేసేందుకు ప్రయత్నం.

ఆధార్ కార్డు కోసం ముందు జాగ్రత్తగా డాక్యుమెంట్స్

యువత, కొత్త ఆధార్ తీసుకునేవారు ఇది ఎక్కువ ప్రభావం ఉంటుంది. ఇక ఆధార్ కార్డు కోసం ముందు జాగ్రత్తగా డాక్యుమెంట్స్ సెట్ చేసుకోవాలి. విదేశీ పౌరులు, ట్రాన్స్జెండర్ వ్యక్తులు, చిన్నారులకు ప్రత్యేకమైన ప్రమాణాలు ఉండబోతున్నాయి. అయితే, ఆధార్ చట్టంలోని సెక్షన్ 9 ప్రకారం, ఆధార్ పత్రాన్ని పౌరసత్వం లేదా నివాసాన్ని నిరూపించడానికి ఉపయోగించరాదు. ఎవరెవరికి ఎక్కువ ప్రభావం ఉంటుంది? యువత, కొత్త ఆధార్ తీసుకునేవారు ఇది ఎక్కువ ప్రభావం ఉంటుంది. ఇక ఆధార్ కార్డు కోసం ముందు జాగ్రత్తగా డాక్యుమెంట్స్ సెట్ చేసుకోవాలి.

వెనక అసలు ఉద్దేశం ఏమిటి?
ఈ మార్పుల వెనక అసలు ఉద్దేశం ఏమిటి? ఇప్పటివరకు 140 కోట్లకు పైగా ఆధార్‌లు జారీ అయ్యాయి. వాటిలో చాలావరకు మోసపూరితంగా పొందబడినవీ ఉండొచ్చు. మరణించిన వ్యక్తులకు కూడా ఆధార్ అకౌంట్లు ఉండటం వంటి ఘటనలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేశాయి. పుట్టిన వెంటనే శిశువులకు ఆధార్ జారీ చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో, ప్రభుత్వం ఆధార్ పొందడంపై నిబంధనలను కఠినతరం చేసింది .

ఆధార్ చరిత్ర ఏమిటి?
ఆధార్ కార్డ్ వినియోగ చరిత్ర: మీ ఆధార్ ... అని ఎలా తనిఖీ చేయాలి
భారతదేశ జాతీయ గుర్తింపు కార్యక్రమం అయిన ఆధార్, అన్ని నివాసితులకు ప్రత్యేకమైన 12-అంకెల గుర్తింపు సంఖ్యను అందించడం, ప్రజా సేవలను క్రమబద్ధీకరించడం మరియు అవినీతిని తగ్గించడం అనే లక్ష్యంతో 2009లో స్థాపించబడింది.

Read hindi news: hindi.vaartha.com

Read Also:Elon Musk: ట్రంప్, ఎలాన్ మస్క్ మధ్య మళ్లీ భగ్గుమన్న విభేదాలు

#telugu News Aadhar Address Change Aadhar KYC Aadhar Update Document Verification Aadhar UIDAI Guidelines

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.