జూలై 1 నుంచి అమలు
– 15 నుంచి ఓటీపీ నిబంధన
న్యూఢిల్లీ: తత్కాల్ టికెట్ల బుకింగ్ లో ఆక్రమాలకు చెక్ పెట్టేందుకు రైల్వే శాఖ పలు కొత్త నిబంధనలను అమల్లోకి తీసుకువస్తోంది. ఇకపై ఆధార్ లింకైన యూజర్లు మాత్రమే ఐఆర్సీటీసీ వెబ్సైట్, మొబైల్ యాప్ లో తత్కాల్ బుకింగులు చేసుకోగలరు. ఇది జూలై ఒకటో తేదీ నుంచి అమల్లోకి రానుంది. జూలై 15 నుంచి యూజర్లు తమ మొబైల్ నంబరక్కు వచ్చే ఓటీపీని సైతం ఎంటర్ చేయడాన్ని కూడా తప్పనిసరి చేయనున్నారు. ఈ నిబంధన కౌంటర్లలో తత్కాల్ టికెట్లు కొనుగోలు చేసే ప్రయాణికులు, ఏజెంట్లకు కూడా వర్తిస్తుందని రైల్వే శాఖ వివరించింది. బుధవారం జారీ చేసిన సర్క్యులర్లో ఈ మేరకు స్పష్టం చేసింది. తత్కాల్ టికెట్ల దుర్వినియోగాన్ని అరికట్టి వాటిని అందరికీ అందుబాటులో ఉంచే లక్ష్యంతోనే కొత్త నిబంధనలు తెస్తున్నట్టు పేర్కొంది. ఇందుకోసం అధీకృత ఏజెంట్లకు తత్కాల్ టికెట్ల బుకింగ్ సదుపాయం 30 నిమిషాలు ఆలస్యంగా అందుబాటులోకి వస్తుందని తెలిపింది.

పైలట్ ప్రాజెక్టుగా బికనేర్ డివిజన్లో అమలు
ఇకనుంచి రైళ్ల వెయిటింగ్ లిస్ట్, కన్ఫర్మ్ టికెట్ల చార్టింగ్ జాబితాను ఇకపై 24 గంటల ముందే వెల్లడించాలని రైల్వే శాఖ యోచిస్తోంది. పైలట్ ‘ప్రాజెక్టుగా బికనేర్ డివిజన్లో దీన్ని అమలు చేస్తారు. సత్ఫలితాలనిస్తే దేశవ్యాప్తంగా అమలు చేస్తారు. ప్రస్తుతం రైలు బయలుదేరే 4 గంటల ముందు మొదటి చార్ట్, 30 నిమిషాల ముందు రెండో చార్ట్ విడుదలవు తాయి. కొత్త నియమాల ప్రకారం కన్ఫర్మ్ సీట్ల సమాచారంతో కూడిన చార్టును 24 గంటల ముందే విడుదల చేస్తారు. తద్వారా దూరప్రయా ణాలు చేసేవారు చివర్లో హడావుడి పడకుండా ప్రయాణాన్ని పక్కాగా షెడ్యూల్ చేసుకోవడం వీలవుతుందని భావిస్తున్నారు. తత్కాల్ టికెట్లు ప్రయాణానికి 48 గంటల ముందు బుక్ అవుతాయి. కనుక 24 గంటల ముందు చార్జ్ విడుదలలో సమస్య ఉండదని పేర్కొన్నాయి.
Read also: SBI Clerk: ఎస్‌బీఐ బ్యాంకు మెయిన్స్ రిజల్ట్స్ విడుదల