ప్రస్తుత డిజిటల్ యుగంలో బ్యాంకింగ్ సేవలు మన అరచేతిలోకి వచ్చేశాయి. కేవలం స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు.. ఇంటి నుండి బయటకు వెళ్లకుండానే నిమిషాల్లో బ్యాంక్ ఖాతాను తెరిచే సదుపాయం అందుబాటులో ఉంది. అయితే ఈ సులభతరమైన పద్ధతే ఇప్పుడు సైబర్ నేరగాళ్లకు వరంగా మారుతోంది. కేవలం ఆధార్ ఓటీపీ (e-KYC) ఆధారంగా ఖాతాలు తెరిచే విధానాన్ని ఆసరాగా చేసుకుని, కేటుగాళ్లు ఇతరుల పేర్లతో ‘మ్యూల్ ఖాతాలను’ సృష్టించి కోట్లాది రూపాయల మోసాలకు పాల్పడుతున్నారు. ఈ ముప్పును గుర్తించిన బ్యాంకులు ఇప్పుడు తమ నిబంధనలను మరింత కఠినతరం చేస్తున్నాయి. ఆధార్ ఓటీపీ విధానంలో ఉన్న లోపం ఏమిటి? ఇప్పటివరకు ఆధార్ తో అనుసంధానమైన మొబైల్ నంబరుకు వచ్చే ఓటీపీని నమోదు చేస్తే సులభంగా ఖాతా ప్రారంభమయ్యేది. కానీ, ఈ పద్ధతిలో ఆధార్ వివరాలు ఉన్న వ్యక్తి నిజంగా ఆయనేనా? లేదా ఆ వివరాలను మరెవరైనా వాడుతున్నారా? అనేది బ్యాంక్ అధికారులకు తెలిసే అవకాశం లేదు. కేవలం డాక్యుమెంట్లు సరిగ్గా ఉంటే చాలు అకౌంట్ ఓపెన్ అయిపోయేది. దీన్ని అడ్డుకోవడానికి బ్యాంకులు ఇప్పుడు వీడియో కైవైసీ (Video KYC) ని తప్పనిసరి చేసే దిశగా అడుగులు వేస్తున్నాయి.
Read Also: TCS Results: టీసీఎస్ లాభం రూ.10657 కోట్లు..
మోసం చేయడం అసాధ్యం
వీడియో కేవైసీ (Video KYC) ఎలా పనిచేస్తుంది? ఈ విధానంలో కేవలం డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయడం సరిపోదు. బ్యాంక్ ప్రతినిధితో వీడియో కాల్‌లో నేరుగా మాట్లాడాల్సి ఉంటుంది. ఆ సమయంలో ఖాతాదారుడు తన ఒరిజినల్ ఆధార్, పాన్ కార్డులను కెమెరా ముందు చూపించాల్సి ఉంటుంది. అంతేకాకుండా, సదరు వ్యక్తి ఎక్కడి నుండి మాట్లాడుతున్నారో వారి ‘లైవ్ లొకేషన్’ రికార్డు అవుతుంది. దీనివల్ల డీప్ ఫేక్ వీడియోలు లేదా ఇతరుల ఫోటోలను ఉపయోగించి మోసం చేయడం అసాధ్యం అవుతుంది. గ్రామీణ ప్రాంతాల కోసం ‘అసిస్టెడ్ కేవైసీ’ స్మార్ట్‌ఫోన్ వాడడం రాని వారు లేదా గ్రామీణ ప్రాంతాల్లో ఉండేవారి కోసం ‘అసిస్టెడ్ వీడియో కేవైసీ’ సదుపాయాన్ని బ్యాంకులు కల్పిస్తున్నాయి. గతంలో కేవలం ఓటీపీ ద్వారా తెరిచిన ఖాతాలకు లావాదేవీల పరిమితి ఉండేది, కానీ, వీడియో కేవైసీ (Video KYC) పూర్తి చేసిన వెంటనే ఆ ఖాతా పూర్తిస్థాయిలో పనిచేస్తుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: