భారతీయ రైల్వే ప్రయాణికులకు ఒక కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 1 నుంచి ఆన్‌లైన్ టికెట్ల బుకింగ్ విధానంలో మార్పులు (Ticket booking process) అమలు కానున్నాయి. ఈసారి జనరల్ రిజర్వేషన్ టికెట్లకు కూడా ఆధార్ తప్పనిసరి కానుంది.కొత్త రూల్స్ ప్రకారం ఆధార్ నిబంధన బుకింగ్ మొత్తం ప్రక్రియకు వర్తించదు. టికెట్లు అందుబాటులోకి వచ్చిన మొదటి 15 నిమిషాల్లో మాత్రమే ఈ నిబంధన అమలవుతుంది. రైల్వే బోర్డు ప్రకారం, ఈ మార్పుతో పారదర్శకత పెరగనుంది.ఏజెంట్లు, బ్రోకర్లు సాఫ్ట్‌వేర్ సహాయంతో ముందుగానే టికెట్లు బుక్ చేస్తున్నారని రైల్వే గుర్తించింది. దాంతో సాధారణ ప్రయాణికులు నష్టపోతున్నారు. ఈ పరిస్థితిని నివారించడానికే ఆధార్ అథంటికేషన్ విధానం తెచ్చారు.
ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్, యాప్‌లకు వర్తింపు
ఈ కొత్త రూల్స్ IRCTC వెబ్‌సైట్ (IRCTC website), మొబైల్ యాప్ రెండింటికీ వర్తిస్తాయి. అయితే స్టేషన్ కౌంటర్‌లో టికెట్ల బుకింగ్ ప్రక్రియలో ఎలాంటి మార్పులు ఉండవు. కేవలం ఆన్‌లైన్ సిస్టమ్‌కే ఈ నిబంధన వర్తిస్తుంది.సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, ఐఆర్‌సీటీసీకి అవసరమైన సాంకేతిక మార్పులు చేయాలని రైల్వే బోర్డు ఆదేశించింది. అంతేకాక, సోషల్ మీడియా ద్వారా ప్రయాణికులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది.ప్రస్తుతం జనరల్ టికెట్ బుకింగ్ ప్రతిరోజూ అర్ధరాత్రి 12:20 గంటలకు మొదలవుతుంది. రాత్రి 11:45 వరకు కొనసాగుతుంది. అదేవిధంగా ప్రయాణ తేదీకి 60 రోజుల ముందే అడ్వాన్స్ బుకింగ్ అవకాశం ఉంటుంది.
తత్కాల్ టికెట్లలో ఇప్పటికే అమల్లో
గమనించదగ్గ విషయం ఏమిటంటే, ఈ ఏడాది జులైలోనే తత్కాల్ టికెట్లకు ఆధార్ అథంటికేషన్ తప్పనిసరి చేశారు. ఇప్పుడు అదే విధానాన్ని జనరల్ రిజర్వేషన్ టికెట్లకూ విస్తరించారు. ఆధార్ ధృవీకరణ లేకుండా తత్కాల్ టికెట్లు బుక్ చేసుకోవడం అసాధ్యం.త్వరలోనే దసరా, దీపావళి, ఛట్ పూజ వంటి పండుగలు రానున్నాయి. ఈ సమయంలో రైలు టికెట్లకు భారీ డిమాండ్ ఉంటుంది. సాధారణంగా బుకింగ్ ప్రారంభమైన వెంటనే టికెట్లు అయిపోతాయి. ఈ పరిస్థితిని దుర్వినియోగం చేసే ఏజెంట్లపై ఆధార్ అథంటికేషన్ పెద్దగా నియంత్రణగా మారనుంది.రైల్వే తీసుకున్న ఈ నిర్ణయం సాధారణ ప్రయాణికులకు మంచి ఊరట. టికెట్ల బుకింగ్‌లో పారదర్శకత పెరగడంతో పాటు మోసాలు తగ్గుతాయి. ఇప్పటికే తత్కాల్ టికెట్లలో కనిపిస్తున్న లాభాలు ఇప్పుడు జనరల్ రిజర్వేషన్‌లోనూ అందుబాటులోకి రానున్నాయి.
Read Also :