ఆధార్ కార్డు తో (Aadhaar Card) మీ మొబైల్ నంబర్ లింక్ చేయడాన్ని కేంద్రం తప్పనిసరి చేసింది. ఇప్పటికే ఆధార్ కార్డు విషయంలో బయోమెట్రిక్స్, అడ్రస్ ప్రూఫ్, సహా యూజర్ గుర్తింపు ధ్రువీకరణకు కేంద్రం అనుమతి ఇవ్వగా.. ఇటీవల మొబైల్ నంబర్‌కు ఆధార్ లింక్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అప్పటి నుంచి అంతా లింక్ చేస్తున్నారు. ఆధార్ కార్డు సేవలను మరింత సరళతరం చేయడానికి భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) కీలక నిర్ణయం తీసుకుంది.
ఆధార్ తో అనుసంధానమైన మొబైల్ నంబర్ ను అప్ డేట్ చేసుకునే విషయంపై కీలక ప్రకటన చేసింది. ఇకపై ఎక్కడి నుంచైనా మొబైల్ నెంబర్ ను అప్ డేట్ చేసుకునే సదుపాయం కల్పించనుంది. దీని కోసం త్వరలో కొత్త వ్యవస్థను ప్రవేశపెట్టనున్నట్లు తెలిపింది. ఆధార్ సేవలను మరింత సౌకర్యవంతంగా వినియోగించుకునేలా చేయడమే దీని ఉద్దేశమని తెలిపింది. ఈ నెల 28 తర్వాత ఈ సౌకర్యం అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది.
Read Also: PM Kisan: 22వ విడుత డేట్ ఫిక్స్.. ఆరోజే ఖాతాల్లోకి రూ.2000!
ఎలా లింక్ చేయాలి ?
టెలికాం ఆపరేటర్స్ తమ కస్టమర్ల కోసం (Aadhaar Card) మొబైల్‌లోనే ఆధార్‌కు ఫోన్ నంబర్ లింక్ చేసేలా (OTP) సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చాయి. దీని కోసం టెలికాం ఆపరేటర్ వెబ్‌సైట్ సందర్శించాలి. సమీపంలో ఉన్న స్టోర్‌కు వెళ్లి కూడా మొబైల్ నంబర్‌ను ఆధార్‌తో లింక్ చేసుకోవచ్చు. ఓటీపీతోనే ఈ ప్రాసెస్ జరుగుతుంది. తొలుత టెలికాం ఆపరేటర్ వెబ్ పోర్టల్ ఓపెన్ చేయాలి. ఆధార్ నంబర్‌కు లింక్ చేసే మొబైల్ నంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత టెలికాం ఆపరేటర్ మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఓటీపీ పంపుతుంది.
ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేయాలి. తర్వాత స్క్రీన్‌పై మీకు ఒక మెసేజ్ కనిపిస్తుంది. ప్రొసీడ్ బటన్ నొక్కాలి. తర్వాత లింక్ చేయాల్సిన మీ 12 అంకెల ఆధార్ నంబర్ జాగ్రత్తగా ఎంటర్ చేయాలి. నెక్ట్స్ OTP కోసం మీ టెలికాం ఆపరేటర్ యూఐడీఏఐకి అభ్యర్థన పంపుతారు. నెక్ట్స్ స్టేజ్‌లో మీరు ఇ-కేవైసీ డీటెయిల్స్ గురించి UIDAI నుంచి పర్మిషన్ రిక్వెస్ట్ అందుకుంటారు. పూర్తిగా చదివి యాక్సెప్ట్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. తర్వాతి దశలో మీ ఫోన్‌కు వచ్చిన ఓటీపీ ఎంటర్ చేయాలి. పదో దశలో మీ ఆధార్‌కు ఫోన్ నంబర్ లింక్ అయినట్లు కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: