📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం

ఢిల్లీ ఎన్నికలకు ముందు కేజ్రీవాల్‌కు షాక్‌..

Author Icon By sumalatha chinthakayala
Updated: January 31, 2025 • 7:51 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

న్యూఢిల్లీ : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ.. ఆ రాష్ట్రంలో రాజకీయాలు కీలక మలుపు తీసుకుంటున్నాయి. ఎన్నికలకు ముందే ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన కొందరు నేతలు, ఎమ్మెల్యేలు, మంత్రి.. పార్టీకి గుడ్‌బై చెప్పగా.. తాజాగా గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సరిగ్గా ఓటింగ్‌కు 5 రోజులు ఉండగా.. ఇలాంటి సమయంలో ఆ పార్టీకి ఏడుగురు ఎమ్మెల్యేలు బిగ్ షాకిచ్చారు. ఎమ్మెల్యే పదవితోపాటు పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలోనే పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కు లేఖ పంపించారు. ఈ ఎన్నికల్లో తమకు టికెట్ కేటాయించకపోవడంతోనే.. పార్టీకి రాజీనామా చేయాల్సి వస్తోందని.. ఆ లేఖలో ఎమ్మెల్యేలు వెల్లడించారు. గతంలో ఆప్ తరఫున ఎమ్మెల్యేలుగా గెలిచిన ఈ ఏడుగురికి ఈసారి పార్టీ టికెట్లు ఇవ్వకపోవడంతో వారు ఈ నిర్ణయం తీసుకున్నారు.

మెహ్రౌలీ ఎమ్మెల్యే నరేష్ యాదవ్.. త్రిలోక్‌పురి ఎమ్మెల్యే రోహిత్ కుమార్.. జనక్‌పురి ఎమ్మెల్యే రాజేష్ రిషి.. కస్తుర్బానగర్ ఎమ్మెల్యే మదన్‌లాల్.. ఆదర్శ్ నగర్ ఎమ్మెల్యే పవన్ శర్మ.. పాలం ఎమ్మెల్యే భావన గౌడ్.. బిజ్వాసన్ ఎమ్మెల్యే బీఎస్ జూన్‌.. శుక్రవారం ఆప్‌కు రాజీనామా చేశారు. ఇక తన రాజీనామా లేఖలో పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌పై పాలెం ఎమ్మెల్యే భావ గౌడ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తనకు కేజ్రీవాల్‌పై నమ్మకం పోయిందని పేర్కొన్నారు.

ఇక మెహ్రౌలీ ఎమ్మెల్యే నరేష్ యాదవ్ కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఖురాన్ అపవిత్రం కేసులో నరేష్ యాదవ్‌ను గతేడాది డిసెంబరులో పంజాబ్ కోర్టు దోషిగా తేల్చింది. ఈ కేసులో అతడికి రెండేళ్ల జైలు శిక్ష కూడా విధించింది. కానీ ఈ తీర్పుపై నరేష్ యాదవ్ స్టే తెచ్చుకున్నారు. అయితే ఈసారి ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ విడుదల చేసిన ఐదో జాబితాలో మెహ్రౌలీ నియోజకవర్గం నుంచి నరేష్ యాదవ్ స్థానంలో మహేందర్ చౌదరిని అభ్యర్థిగా ఆప్ ప్రకటించడంతో ఆయన అసంతృప్తిగా ఉన్నారు.

AAP Arvind Kejriwal Delhi Assembly Elections resignation Seven MLAs

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.