📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

ఎన్నికలకు ముందు ఆప్ పార్టీకి షాక్

Author Icon By sumalatha chinthakayala
Updated: January 15, 2025 • 10:24 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్, మాజీ మంత్రి మనీష్ సిసోడియాలను విచారించేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అనుమతి మంజూరు చేసింది. ఈ కేసులో ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రిని విచారించేందుకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా అనుమతివ్వడంతో మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రజా ప్రతినిధులను ప్రాసిక్యూట్ చేయడానికి ముందు ఈడీ ముందస్తు అనుమతి తీసుకోవాలని నవంబర్‌ 2024లో సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆ తర్వాత దర్యాప్తు సంస్థ వీకే సక్సేనాకు లేఖ రాయగా.. అందుకు ప్రతిస్పందించిన హోం శాఖ.. కేజ్రీవాల్ ఈ స్కామ్‌లో విచారించేందుకు అనుమతి మంజూరు చేయాలని పేర్కొంది.

image

2021-22కి సంబంధించి ఇప్పుడు అమలులో లేని ఢిల్లీ ఎక్సైజ్ పాలసీని రూపొందించడంలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై కేజ్రీవాల్‌పై ఈ కేసు కొనసాగుతోంది. మాజీ ఉప ముఖ్యమంత్రి సిసోడియాతో సహా ఇతర ఆప్ నేతలు ఈ కుంభకోణంలో భాగమైనట్టు ఆరోపణలు వచ్చాయి. మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి మార్చి 21, 2024న ఈడీ సిసోడియాను మొదటిసారి అరెస్టు చేసింది. తర్వాత, అవినీతి కేసులో కేజ్రీవాల్‌ను 2024 జూన్ 26న సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అరెస్టు చేసింది. సెప్టెంబర్ 2024లో, ఆప్ చీఫ్‌కి సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది.

బెయిల్ పొందిన కొద్ది రోజులకే, కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. సీనియర్ ఆప్ నేత అతిషి ఢిల్లీ ముఖ్యమంత్రిగా నియమితులయ్యారు. ఇదిలా ఉండగా, మద్యం పాలసీ కేసులో ఈడీ, సీబీఐ అరెస్టు చేసిన 17 నెలల తర్వాత సిసోడియా ఆగస్టు 2024లో జైలు నుంచి బయటకు వచ్చారు. కాదా ఫిబ్రవరి 5న జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు జంగ్‌పురా స్థానం నుంచి సీనియర్ పార్టీ నాయకుడిని ఆప్ పోటీకి దింపింది.

ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలకు ఎన్నికల సంఘం ఇటీవలే షెడ్యూల్ ప్రకటించింది. ఈ పోలింగ్ ఫిబ్రవరి 5న జరగనుండగా, 8న ఓట్ల లెక్కింపు ఫలితాలను వెల్లడించనున్నారు. ఆప్ మాత్రం ఇప్పటికే మొత్తం అభ్యర్ధులను ప్రకటించగా, కాంగ్రెస్ కొంత మంది పేర్లను విడుదల చేసింది. ఢిల్లీ అసెంబ్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలుండగా ఇప్పటి వరకు 63 స్థానాలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. జనవరి నెల ప్రారంభంలో విడుదల చేసిన జాబితాలో కల్కాజీ నియోజకవర్గం నుంచి మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆల్కా లాంబా పోటీ చేస్తారని ప్రకటించింది.

AAP Arvind Kejriwal Liquor Scam Case Manish Sisodia

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.