📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Air Force runway : ఓ తల్లి కొడుకు … వాయుసేన రన్‌వేనే అమ్మేశారు!

Author Icon By Divya Vani M
Updated: July 2, 2025 • 7:15 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఒకవైపు సినిమాల్లో వినిపించే డైలాగ్‌ – “చార్మినార్‌ నాది.. అమ్మేస్తా!” అనే మాటలు వినోదంగా అనిపించొచ్చు. కానీ పంజాబ్‌లో అలాంటి మోసం నిజంగా జరిగింది. ఓ తల్లి కొడుకు (A mother’s son) కలిసి దేశ రక్షణకు కీలకమైన ఎయిర్‌ఫోర్స్‌ రన్‌వేను (Air Force runway) ప్రైవేట్ వ్యక్తులకు అమ్మేయడం నిజంగా షాకింగ్!పంజాబ్‌ రాష్ట్రంలోని డుమినివాలా గ్రామానికి చెందిన ఉషా అన్సాల్‌, ఆమె కుమారుడు నవీన్ చంద్ 1997లో తప్పుడు పత్రాలు సృష్టించి రన్‌వే భూమిని వ్యక్తులకు అమ్మేశారని ఆరోపణలు ఉన్నాయి. ఈ స్థలం పాకిస్తాన్ సరిహద్దుకు దగ్గరలో ఉన్న ఫట్టువాలా గ్రామం శివారులో ఉంది.ఈ భూమి హల్వారా ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌కు చెందినది. ఇది 982 ఎకరాల్లో విస్తరించి ఉంది. బ్రిటిష్ రాజ్యంలో రెండో ప్రపంచ యుద్ధ సమయంలో, అలాగే 1962, 1965, 1971 భారత-చైనా, భారత-పాక్ యుద్ధాల్లో వాయుసేన కీలకంగా ఉపయోగించిన స్థలం ఇది.

మోసం ఎలా వెలుగులోకి వచ్చింది?

తప్పుడు డాక్యుమెంట్లతో రన్‌వేను సొంతంగా చూపించి 15 ఎకరాల భూమిని విక్రయించిన ఈ తల్లీకొడుకులపై అప్పట్లోనే నిషాన్ సింగ్ అనే మాజీ రెవెన్యూ ఉద్యోగి ఫిర్యాదు చేశారు. అయితే 2021 వరకు ఎలాంటి చర్యలు లేవు. మళ్లీ ఎయిర్‌ఫోర్స్ అధికారులు కూడా ఫిర్యాదు చేయడంతో వ్యవహారం తిరిగి బయటకు వచ్చింది.

కోర్టు రంగప్రవేశం

ఈ భూ మోసంపై నిషాన్ సింగ్ పంజాబ్, హర్యానా హైకోర్టును ఆశ్రయించారు. స్పందించిన కోర్టు, నాలుగు వారాల్లో విచారణ నివేదిక ఇవ్వాలని విజిలెన్స్ బ్యూరో చీఫ్‌కి ఆదేశించింది.

ఎయిర్‌ఫోర్స్ భూమి తిరిగి స్వాధీనం

ఇటీవలి మేలో ఈ భూమిని తిరిగి రక్షణ శాఖ స్వాధీనం చేసుకుంది. అయితే ఇప్పటికీ ఈ కేసు దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. ఈ తరహా భూ మోసాలపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Read Also : Heart Attacks : హసన్ లో గుండెపోటు మరణాలు : 40 రోజుల్లో 24 మంది మృతి

Air Force runway sale Defense Department land dispute Halwara Air Force Station land fraud with false documents Punjab court orders Punjab land scam Usha Ansal Naveen Chand fraud

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.