ఒకవైపు సినిమాల్లో వినిపించే డైలాగ్ – “చార్మినార్ నాది.. అమ్మేస్తా!” అనే మాటలు వినోదంగా అనిపించొచ్చు. కానీ పంజాబ్‌లో అలాంటి మోసం నిజంగా జరిగింది. ఓ తల్లి కొడుకు (A mother’s son) కలిసి దేశ రక్షణకు కీలకమైన ఎయిర్‌ఫోర్స్ రన్‌వేను (Air Force runway) ప్రైవేట్ వ్యక్తులకు అమ్మేయడం నిజంగా షాకింగ్!పంజాబ్ రాష్ట్రంలోని డుమినివాలా గ్రామానికి చెందిన ఉషా అన్సాల్, ఆమె కుమారుడు నవీన్ చంద్ 1997లో తప్పుడు పత్రాలు సృష్టించి రన్‌వే భూమిని వ్యక్తులకు అమ్మేశారని ఆరోపణలు ఉన్నాయి. ఈ స్థలం పాకిస్తాన్ సరిహద్దుకు దగ్గరలో ఉన్న ఫట్టువాలా గ్రామం శివారులో ఉంది.ఈ భూమి హల్వారా ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌కు చెందినది. ఇది 982 ఎకరాల్లో విస్తరించి ఉంది. బ్రిటిష్ రాజ్యంలో రెండో ప్రపంచ యుద్ధ సమయంలో, అలాగే 1962, 1965, 1971 భారత-చైనా, భారత-పాక్ యుద్ధాల్లో వాయుసేన కీలకంగా ఉపయోగించిన స్థలం ఇది.
మోసం ఎలా వెలుగులోకి వచ్చింది?
తప్పుడు డాక్యుమెంట్లతో రన్‌వేను సొంతంగా చూపించి 15 ఎకరాల భూమిని విక్రయించిన ఈ తల్లీకొడుకులపై అప్పట్లోనే నిషాన్ సింగ్ అనే మాజీ రెవెన్యూ ఉద్యోగి ఫిర్యాదు చేశారు. అయితే 2021 వరకు ఎలాంటి చర్యలు లేవు. మళ్లీ ఎయిర్‌ఫోర్స్ అధికారులు కూడా ఫిర్యాదు చేయడంతో వ్యవహారం తిరిగి బయటకు వచ్చింది.
కోర్టు రంగప్రవేశం
ఈ భూ మోసంపై నిషాన్ సింగ్ పంజాబ్, హర్యానా హైకోర్టును ఆశ్రయించారు. స్పందించిన కోర్టు, నాలుగు వారాల్లో విచారణ నివేదిక ఇవ్వాలని విజిలెన్స్ బ్యూరో చీఫ్‌కి ఆదేశించింది.
ఎయిర్‌ఫోర్స్ భూమి తిరిగి స్వాధీనం
ఇటీవలి మేలో ఈ భూమిని తిరిగి రక్షణ శాఖ స్వాధీనం చేసుకుంది. అయితే ఇప్పటికీ ఈ కేసు దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. ఈ తరహా భూ మోసాలపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
Read Also : Heart Attacks : హసన్ లో గుండెపోటు మరణాలు : 40 రోజుల్లో 24 మంది మృతి