📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్

Latest News: Vijay: విజయ్ సభ వద్దకు తుపాకీతో వచ్చిన వ్యక్తి..

Author Icon By Anusha
Updated: December 9, 2025 • 1:08 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో టీవీకే అధినేత విజయ్ (Vijay) తన రాజకీయ ప్రచార షెడ్యూల్‌ను వేగవంతం చేస్తున్నారు. అందులో భాగంగానే ఇవాళ పుదుచ్చేరిలోని ఉప్పలం గ్రౌండ్స్‌లో జరిగే బహిరంగ సభలో పాల్గొన్నారు. అయితే విజయ్‌ సమావేశానికి పుదుచ్చేరి ప్రభుత్వం షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. TVK పార్టీ (TVK Party) మీటింగ్‌కు 5 వేల మందికి మాత్రమే అనుమతి ఇచ్చింది..

Read Also: DK Shivakumar : మరోసారి తెరపైకి సీఎం పదవికి  వివాదం..డీకే శివకుమార్ స్పందన

అడ్డుకున్న పోలీసులు

అయితే, బహిరంగ సభ వద్ద కలకలం రేగింది. సభా ప్రాంగణంలోకి తుపాకీతో ప్రవేశించేందుకు యత్నించిన ఓ వ్యక్తిని భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. అతడిని పార్టీ శివగంగై జిల్లా కార్యదర్శి ప్రభుకు సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న డేవిడ్‌గా గుర్తించారు. ఈ ఘటనతో అక్కడ కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

A man came to Vijay Sabha with a gun..

కరూర్‌లో జరిగిన తొక్కిసలాటలో 41 మంది మరణించిన విషాదం తర్వాత విజయ్ (Vijay) నిర్వహిస్తున్న తొలి బహిరంగ సభ ఇదే కావడంతో పోలీసులు అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. భద్రతా కారణాల దృష్ట్యా సభా ప్రాంగణంలోకి పిల్లలు, గర్భిణులు, వృద్ధులకు ప్రవేశం నిరాకరించారు.

పార్టీ జారీ చేసిన ప్రత్యేక క్యూఆర్ కోడ్ పాస్ ఉన్నవారిని మాత్రమే లోపలికి అనుమతించారు. తాగునీరు, అంబులెన్సులు, ప్రథమ చికిత్స బృందాలను సిద్ధంగా ఉంచాలని నిర్వాహకులను ఆదేశించారు. అంతకుముందు విజయ్ రోడ్ షోకు అనుమతి నిరాకరించిన పోలీసులు, కేవలం సభకు మాత్రమే కఠిన షరతులతో కూడిన అనుమతినిచ్చారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

latest news Puducherry Security Incident Tamilaga Vetri Kalam Telugu News vijay

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.