📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

Yang: 12 ఏళ్ల వయసులో మింగిన బ్రష్..52 ఏళ్ల తర్వాత బయటకు..

Author Icon By Shobha Rani
Updated: June 24, 2025 • 1:11 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

చైనాలో ఒక విచిత్రమైన సంఘటన వెలుగు చూసింది. 52 ఏళ్ల క్రితం మింగిన ఒక టూత్‌బ్రష్‌(Tooth brush)ను వైద్యులు 64 ఏళ్ల వ్యక్తి శరీరం నుంచి తాజాగా బయటకు తీశారు. కడుపు నొప్పితో ఆసుపత్రికి వచ్చిన యాంగ్ (Yang)అనే వ్యక్తికి సాధారణ జీర్ణవ్యవస్థ పరీక్షలు చేస్తుండగా, అతని చిన్న పేగులో 17 సెంటీమీటర్ల పొడవైన టూత్‌బ్రష్ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు.
12 ఏట టూత్‌బ్రష్‌ను అపరిశీలంగా మింగడం
సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ కథనం ప్రకారం.. యాంగ్ తన 12వ ఏట ఈ టూత్‌బ్రష్‌(Tooth brush)ను మింగినట్లు గుర్తుచేసుకున్నారు. భయంతో ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేదన్నారు. టూత్‌బ్రష్ దానంతట అదే కరిగిపోతుందని భావించానన్నారు. 52 ఏళ్లుగా బ్రష్ కడుపులోనే ఉన్నప్పటికీ యాంగ్ (Yang)కు ఎలాంటి ఇబ్బంది కలగకపోవడం గమనార్హం.
అసాధారణమైన నిర్లక్ష్యం.. అదృష్టవశాత్తూ ప్రాణాపాయం తప్పింది
ఈ విషయం తెలిసిన వెంటనే, వైద్యులు యాంగ్‌(Yang)కు ఎండోస్కోపిక్ శస్త్రచికిత్స నిర్వహించి, 80 నిమిషాల్లో టూత్‌బ్రష్‌ను విజయవంతంగా తొలగించారు. గత మూడేళ్లలో ఒక రోగి జీర్ణవ్యవస్థ నుంచి వస్తువును తీయడానికి ఇంత

Yang: 12 ఏళ్ల వయసులో మింగిన బ్రష్..52 ఏళ్ల తర్వాత బయటకు..

ఎక్కువ సమయం పట్టడం ఇదే మొదటిసారని వైద్యులు పేర్కొన్నారు. పేగుల్లో ఇలాంటి వస్తువులు కదులుతూ లోపలి కణజాలాన్ని పాడుచేసి, ప్రాణాంతకమైన పేగుల చిల్లులు (ఇంటెస్టినల్ పెర్ఫొరేషన్) కలిగించే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు తెలిపారు.
పేగులోని ఒక వంపులో కదలకుండా ఉండడం
యాంగ్ (Yang) విషయంలో, టూత్‌బ్రష్ అదృష్టవశాత్తూ పేగులోని ఒక వంపులో కదలకుండా ఉండిపోవడంతో పెను ప్రమాదం తప్పిందని వారు వివరించారు. యాంగ్ (Yang) శరీరం నుంచి టూత్‌బ్రష్‌ను విజయవంతంగా తొలగించిన వార్త వైరల్ అవ్వడంతో, ఇన్నేళ్లపాటు శరీరానికి ఎలాంటి హానీ కలగకపోవడం అతని అదృష్టమని పలువురు సోషల్ మీడియాలో వ్యాఖ్యానించారు.
ఇది ఒక హెచ్చరిక కూడా
శరీరంలో విలీనంకాకపోయే వస్తువులను అనుకోకుండా మింగితే దాని తీవ్రత ఏమిటో చూపించే సంఘటన. చిన్న చిన్న విషయాలను తేలికగా తీసుకోవద్దని నిపుణుల సూచన. ఇలాంటి ఘటనలు మిగిలిన వారికి ఒక ఎడ్యుకేషనల్ ఉదాహరణగా మారాలి.

Read Also: Suresh Rathore : నటిని పెళ్లాడి చిక్కుల్లో పడిన మాజీ ఎమ్మెల్యే

A brush swallowed at the age of 12.. Breaking News in Telugu came out after 52 years.. EndoscopySuccess Google news Google News in Telugu Latest News in Telugu MedicalMiracle Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news ToothbrushInStomach WeirdMedicalCase YangToothbrushStory

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.