(Coronavirus) దేశంలో మళ్లీ కరోనా కేసులు (Corona cases) పెరుగుతున్నాయి. మహారాష్ట్ర (Maharashtra), తమిళనాడు, కర్ణాటక, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో వైరస్ ఆందోళన కలిగిస్తోంది.ఆరోగ్య శాఖ అధికారులు ముందుజాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు లక్షణాలు తక్కువగా ఉన్నప్పటికీ, కేసుల సంఖ్య పెరుగుతుండటం గమనార్హం.మహారాష్ట్ర ఆరోగ్య శాఖ తాజా గణాంకాల ప్రకారం, ముంబైలో మేలోనే 95 కొత్త కేసులు , (95 new cases in May alone) నమోదయ్యాయి.ఈ సంఖ్య మొత్తం రాష్ట్రంలో నమోదైన 106 కేసుల్లో ఎక్కువగా ఉంది.16 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కొందరిని కేఈఎం ఆసుపత్రి నుంచి సెవెన్ హిల్స్‌కు తరలించారు.ప్రస్తుతం జ్వరం, గొంతు నొప్పి, శ్వాసకోశ ఇన్ఫెక్షన్ లక్షణాలతో ఉన్నవారికి కోవిడ్ పరీక్షలు జరుగుతున్నాయి.
పుణేలో ముందు జాగ్రత్త చర్యలు
పుణేలో ప్రస్తుతం యాక్టివ్ కేసులు లేవు. అయినా, నాయుడు ఆసుపత్రిలో 50 పడకలు సిద్ధం చేశారు.87 ఏళ్ల వృద్ధురాలు ఇటీవల కోలుకుంది. నగరంలోని సివిక్ ఆసుపత్రుల్లో పరీక్షలు నిలిపివేశారు.కేంద్రం నుంచి కొత్త మార్గదర్శకాలు వచ్చే వరకూ పరీక్షలు కొనసాగవు అని డాక్టర్ నీనా బోరాడే వెల్లడించారు.
తమిళనాడులో కేసుల తాకిడి
తమిళనాడులోనూ కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి.పుదుచ్చేరిలో 12 కొత్త కేసులు బయటపడ్డాయి.చెన్నైలో కొంతకాలంగా కనిపిస్తున్న జ్వరాలు ఇప్పుడు కోవిడ్‌గా మారుతున్నాయని వైద్యులు చెబుతున్నారు.ఇన్ఫెక్షన్ రిస్క్ ఎక్కువగా ఉండటంతో, కీలక ఆపరేషన్లు వాయిదా వేస్తున్నారు.ఇది ప్రజలకు మరోసారి హెచ్చరికే.
కర్ణాటక, గుజరాత్ అప్డేట్స్
కర్ణాటకలో 16 యాక్టివ్ కేసులు ఉన్నట్లు మంత్రి దినేష్ గుండూరావు తెలిపారు.గుజరాత్‌లోని అహ్మదాబాద్ నగరంలో ఒక్కరోజులో 7 కేసులు బయటపడ్డాయి.ఇదివరకు నెలకు ఒకటో రెండో కేసే ఉండేదని అధికారులు గుర్తించారు.బాధితులందరూ హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. వారి నమూనాలను జెనొమ్ సీక్వెన్సింగ్ కోసం పంపించారు.
ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
కేసులు పెరుగుతున్న వేళ, ప్రజలు మాస్కులు ధరించడం, సానిటైజర్ ఉపయోగించడం, బహిరంగ వేడుకల్ని తగ్గించడం వంటి ముందుజాగ్రత్తలు పాటించాలి.అధికారుల సూచనలతో పాటుగా, వైరస్‌ను వ్యాపించకుండా మనమే జాగ్రత్త పడాలి.
Read Also : Janhvi Kapoor : తల్లి శ్రీదేవిని తలుచుకొని కన్నీటిపర్యంతం : జాన్వీ కపూర్