📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె

Latest News: Marriage: 35 ఏళ్ల మహిళను పెళ్లి చేసుకున్న 70 ఏళ్ల వృద్ధుడు

Author Icon By Anusha
Updated: October 12, 2025 • 11:02 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రేమ అనే దోమ ఎప్పుడు ఎవరిని కుడుతుందో ముందస్తుగా చెప్పలేం. చిన్న వయసులో కొందరు ప్రేమలో పడతారు. కానీ, చాలా మంది ఈ వయసులో అలాంటి భావనలను దూరంగా ఉంచతారు. వారు ప్రేమను వ్యక్తపరిచినా, మనసుకు దగ్గరగా ఎవరినీ తీసుకోకుండా దూరంగా వుంచుతుంటారు.కానీ ఈ మధ్య కాలంలో వృద్ధులు కూడా కుర్రాళ్లలా మారిపోతున్నారు. అప్పుడే కాలేజీ అయిపోయిందన్నట్లుగా భావిస్తూ.. తాము ప్రేమించిన వారిని పెళ్లి చేసుకోవాలని తహతహలాడిపోతున్నారు. అందుకోసం ఎంత ధైర్యం అయినా చేస్తున్నారు.

PM Kisan: రైతులకు గుడ్‌న్యూస్‌: పీఎం కిసాన్ 21వ విడతపై బిగ్ అప్‌డేట్

ఛత్తీస్‌గఢ్ బిలాస్‌పూర్‌ (Bilaspur) లోని సర్కండ చింగ్రాజ్‌పర ప్రాంతానికి చెందిన దాదు రామ్ గంధర్వ అనే 70 ఏళ్ల వృద్ధుడు ప్రతి రోజు కూలీ పనులు చేస్తూ.. జీవితాన్ని వెళ్లదీస్తున్నాడు. ప్రస్తుతం ఆయన ఒంటరిగా జీవిస్తుండగా.. కొంతకాలంగా దాదు రామ్ గంధర్వ (Ram Gandharva) అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న 35 ఏళ్ల మహిళపై మనసు పడ్డాడు. అయితే కొన్నాళ్ల పాటు ఆ విషయాన్ని మనసులోనే దాచుకున్నాడు.

కానీ అమ్మాయిని మాత్రం అదే పనిగా చూసేవాడు. ఆమె కూడా ఇతడిని చూస్తూ నవ్వేది. దీంతో దాదు రామ్‌కు ధైర్యం వచ్చింది. ఆమెకు కూడా తానంటే ఇష్టమని అనిపించింది. దీంతో వెంటనే వెళ్లి ఆమెకు తన ప్రేమ విషయం చెప్పాడు.వయసులో తనకంటే 35 ఏళ్లు పెద్ద వాడైనప్పటికీ నిజాయితీగా అతడి ప్రేమను వ్యక్తం చేయడం.. ఆమెకు బాగా నచ్చింది.

Marriage

గ్రామస్థులు పెద్ద ఎత్తున హాజరై

దీంతో అతడి ప్రేమకు అంగీకారం తెలిపింది. మీరు కూడా నాకిష్టమే అంటూ మనసులోని మాటను బయటపెట్టింది. ఇలా వీరిద్దరి మనసులు కవలగా.. కలిసే జీవించాలని నిర్ణయించుకున్నారు. వయసులో ఉన్న భారీ వ్యత్యాసాన్ని పట్టించుకోకుండా, వారిద్దరూ కలిసి అందరినీ ఒప్పించి పెళ్లి చేసుకోవాలనుకున్నారు.

ఇదే విషయాన్ని అందరికీ చెప్పగా వారు కూడా దగ్గరుండి తామే పెళ్లి చేస్తామన్నారు. ఇలా ఈ జంట తమ ఆచారం ప్రకారం.. గురువారం రోజు రాత్రి శివాలయంలో పెళ్లి చేసుకున్నారు. ఈ వేడుకకు గ్రామస్థులు పెద్ద ఎత్తున హాజరై.. ప్రేమ (Love) కు వయసు అడ్డు కాదని నిరూపించిన ఈ జంటకు తోడ్పాటు అందించారు.స్థానికుల అభినందనల నడుమ ఈ నూతన జంట తమ కొత్త జీవితాన్ని ఉల్లాసంగా ప్రారంభించారు.

వయసులో ఇంత వ్యత్యాసం ఉన్నా.. వారి మధ్య చిగురించిన ప్రేమను చూసి స్థానికులు ఆశ్చర్యంగా తిలకించారు. చప్పట్లు కొడుతూ, కొత్త దంపతులకు ఆశీస్సులు అందించారు. ఈ వింత, హృదయాన్ని తాకే ప్రేమకథ ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌ (Chhattisgarh) లో హాట్ టాపిక్‌గా మారింది. మరి దీన్ని చూస్తే మీకేమనిపిస్తుందో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

Chhattisgarh latest news love senior love stories Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.