📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Latest Telugu News: Scholarship: రూ.48 వేల స్కాలర్‌షిప్ ..వెంటనే అప్లై చేసేయండి!

Author Icon By Vanipushpa
Updated: October 8, 2025 • 5:14 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రభుత్వ పాఠశాలలో చదివే పేద విద్యార్థులను ప్రోత్సహించేందుకు కేంద్రం నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్‌(Scholarship)ను తీసుకొచ్చింది. ఈ స్కాలర్‌షిప్‌కు ఆదర్శ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు అప్లై చేసుకోవచ్చు. ఏపీలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మున్సిపల్, ఎయిడెడ్, మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలు, వసతి సౌకర్యం లేని ఆదర్శ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు అప్లై చేసుకోవాలి. అయితే వారి కుటుంబ సంవత్సరం ఆదాయం రూ.3,50,000 లోపు మాత్రమే ఉండాలి. అలాగే ఏడో తరగతిలో 55 శాతం మార్కులు వస్తేనే అప్లై చేసుకోవడానికి అవకాశం ఇస్తారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 5 శాతం మార్కులు సడలింపు ఉంటుంది. దీనికి అప్లై చేసుకోవడానికి ఆధార్ కార్డు, స్టడీ సర్టిఫికేట్, మార్క్స్ మెమో, ఇన్‌కమ్ సర్టిఫికేట్, పాస్ పోర్టు సైజ్ ఫొటో కావాలి. బీసీ, ఓసీ విద్యార్థులు అప్లై చేసుకోవడానికి రూ.100, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రూ.50 తీసుకుంటారు.

NCRB Report: రైతుల కంటే విద్యార్థుల ఆత్మహత్యలే ఎక్కువ.. ఎక్కడంటే?

Scholarship: రూ.48 వేల స్కాలర్‌షిప్ ..వెంటనే అప్లై చేసేయండి!

నాలుగేళ్ల పాటు స్కాలర్‌షిప్ ఇస్తారు
పూర్తి వివరాల కోసం జిల్లా విద్యాశాఖధికారి కార్యాలయానికి సంప్రదించవచ్చు. అయితే ఈ స్కాలర్‌షిప్ నాలుగేళ్ల పాటు ఇస్తారు. ప్రతీ ఏడాది రూ.12 వేలు చొప్పున మొత్తం రూ.48 వేలు అందిస్తారు. ఈ స్కాలర్ ‌షిప్(Scholarship) కోసం పరీక్షను 7,8 తరగతి సిలబస్‌ల ఆధారంగా ఇస్తారు. తెలుగు, ఇంగ్లీషులో ఈ పరీక్ష రెండు విభాగాల్లో ఉంటుంది. మొదటి విభాగంలో మానసిక సామర్థ్యం, రెండో పేపర్‌లో విషయ సామర్థ్యంపై మల్టిపల్ ఛాయిస్ ప్రశ్నలు అడుగుతారు. ఇందులో ఒక్కో విభాగానికి 90 మార్కులు ఉంటాయి. మొత్తం 180 మార్కులతో పరీక్ష పేపర్ ఉంటుంది. అయితే ఈ పరీక్షలో క్వాలిఫై అయిన వారికి నాలుగేళ్లు అనగా, తొమ్మిది, పది, ఇంటర్ వరకు స్కాలర్‌షిప్ ఇస్తారు. అది కూడా తొమ్మిదో తరగతిలో 55 శాతం, పదో తరగతిలో 60 శాతం, ఇంటర్‌లో 55 శాతం మార్కులు సాధిస్తేనే వస్తుంది. దీనికి అప్లై చేసుకోవడానికి అక్టోబర్ 15 చివరి తేదీ.

విద్యలో, స్కాలర్‌షిప్ అనేది 
విద్యార్థులకు ట్యూషన్, జీవన వ్యయాలు మరియు పుస్తకాలు వంటి వారి చదువుల ఖర్చులను భరించటానికి అందించే ఆర్థిక పురస్కారం మరియు ఇది తిరిగి చెల్లించవలసిన రుణం కాదు.

స్కాలర్‌షిప్ ఉద్దేశ్యం ఏమిటి?
విద్యార్థి విద్యకు మద్దతుగా ఇచ్చే గ్రాంట్ లేదా చెల్లింపు, విద్యాపరమైన లేదా ఇతర విజయాల ఆధారంగా ఇవ్వబడుతుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

apply now education support Government Schemes Latest News Breaking News scholarship 2025 scholarship opportunity student benefits student financial aid Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.