📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Latest News: Vande Bharat trains: మరో 4 కొత్త వందే భారత్ రైళ్లు ప్రారంభం

Author Icon By Anusha
Updated: November 3, 2025 • 5:18 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

దేశవ్యాప్తంగా రైల్వే సేవలను ఆధునీకరించేందుకు, ప్రయాణికులకు వేగవంతమైన ప్రయాణ అనుభవం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. రైల్వే శాఖ గత కొన్ని సంవత్సరాలుగా రైళ్లను సాంకేతికంగా మెరుగుపరచడంలో, రైలు మార్గాలను విస్తరించడంలో విశేష ఫలితాలను సాధిస్తోంది. ఈ క్రమంలోనే 2019లో ప్రారంభమైన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు (Vande Bharat trains) దేశవ్యాప్తంగా రైల్వే రంగంలో కొత్త దశను ప్రారంభించాయి.

Read Also: Uttar Pradesh: చికెన్ ఫ్రై కోసం గొడవ .. తొక్కిసలాట!

టికెట్ ధర కాస్త ఎక్కుగానే ఉన్నా.. ప్రయాణికులు మాత్రం వందే భారత్ రైళ్ల (Vande Bharat trains) పై మక్కువ చూపిస్తున్నారు. క్రమక్రమంగా దేశవ్యాప్తంగా చాలా మార్గాల్లో ఇప్పుడు వందే భారత్ రైళ్లు పరుగులు పెడుతున్నాయి. మరో నాలుగు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సెమీ హై స్పీడ్ రైళ్లను ప్రారంభించేందుకు రైల్వే శాఖ సిద్ధమవుతోంది.

రైల్వే మంత్రిత్వ శాఖ ఈ 4 కొత్త రైళ్లకు నోటిఫికేషన్ విడుదల చేసింది.కర్ణాటకలోని బెంగళూరు నుంచి కేరళలోని కొచ్చి (ఎర్నాకుళం జంక్షన్).. పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ కంట్ నుంచి ఢిల్లీ వరకు.. ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసి నుంచి మధ్యప్రదేశ్‌లోని ఖజురహో వరకు.. ఉత్తర్‌ప్రదేశ్‌లోని లక్నో నుంచి సహారన్‌పూర్ వరకు.. ఈ కొత్త వందే భారత్ రైళ్లను నడపాలని రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది.

రైల్వే బోర్డు విడుదల చేసిన నోటిఫికేషన్

ఈ కొత్త వందే భారత్ రైళ్లు .. పలు రాష్ట్రాలను అనుసంధానం చేస్తాయని పేర్కొంది. మరీ ముఖ్యంగా కర్ణాటక, కేరళ, పంజాబ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ రాష్ట్రాలను కలుపుతూ ఈ సెమీ హైస్పీడ్ రైళ్లను నడపనున్నారు.రైల్వే బోర్డు విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. బెంగళూరు–కొచ్చి వందే భారత్ రైలు షెడ్యూల్ విడుదల చేసింది.

Vande Bharat trains

రైలు నంబర్ 26651 గల కేఎస్‌ఆర్ బెంగళూరు–ఎర్నాకుళం జంక్షన్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఉదయం 5.10 గంటలకు బెంగళూరు నుంచి బయలుదేరనున్నట్లు తెలిపింది. ఆ రైలు.. మధ్యాహ్నం 1.50 గంటలకు ఎర్నాకుళం జంక్షన్‌కు చేరుకుంటుంది.

ఈ కొత్త రైళ్లకు సంబంధించిన అధికారిక నోటిఫికేషన్లను

తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం 2.20 గంటలకు ఎర్నాకుళంలో ప్రారంభం కానుంది. అదే రోజు రాత్రి 11 గంటలకు బెంగళూరు చేరుకుంటుంది. ఇక ఈ బెంగళూరు-కొచ్చి వందే భారత్ రైలు కృష్ణరాజపురం, సేలం, ఈరోడ్, తిరుప్పూర్, కోయంబత్తూర్, పాలక్కాడ్, త్రిస్సూర్‌ స్టేషన్లలో ఆగుతుంది.

ఇక ఈ రైలు రావడంతో.. కేరళలో మూడోది కావడం గమనార్హం.తిరువనంతపురం–కాసర్‌గోడ్.. తిరువనంతపురం–మంగళూరు తర్వాత ప్రారంభం కానున్న మూడో వందే భారత్ రైలు కావడం విశేషం. ఈ కొత్త రైళ్లకు సంబంధించిన అధికారిక నోటిఫికేషన్లను రైల్వే మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. దక్షిణ రైల్వే.. నైరుతి రైల్వే జోన్‌లకు ఈ రైళ్లను సాధ్యమైనంత త్వరగా ప్రారంభించాలని రైల్వే మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper:  epaper.vaartha.com/

Read Also:

Indian Railways latest news Telugu News vande bharat express

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.