యూట్యూబ్(Youtube)లో 30 మిలియన్ (3 కోట్లు) మంది సబ్స్క్రైబర్లను దాటిన తొలి భారతీయ కుకింగ్ ఛానల్‌గా “విలేజ్ కుకింగ్ ఛానల్ (Village Cooking Channel)” కొత్త రికార్డ్ నెలకొల్పింది. 2018లో చిన్నవీరమంగళం గ్రామానికి చెందిన ఒక కుటుంబం ఈ ఛానల్‌ను ప్రారంభించింది.
Read Also: Pinarayi Vijayan: కేరళ సీఎంకు ED నోటీసులు
వారు వండిన ఆహారాన్ని వృద్ధులకు, అనాథలకు, దివ్యాంగ పిల్లలకు పంపిణీ చేయడం వీరి ప్రత్యేకమైన సేవగా మారింది. సహజమైన ప్రదేశాల్లో, సంప్రదాయ పద్ధతుల్లో వంటలు చేస్తూ ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు పొందారు. విదేశాల్లో నివసించే తమిళులు కూడా పలు కార్యక్రమాలకు వీరిని ఆహ్వానించారు.
యూట్యూబ్ గోల్డ్, డైమండ్ ప్లే బటన్(Diamond Play Button)లు అందుకుంటూ, రోజురోజుకు వీరి ప్రాచుర్యం మరింత పెరిగింది. సోషల్ మీడియా లో కూడా వీరి వీడియోలు లక్షల లైకులు, మిలియన్ల వ్యూస్ సాధిస్తున్నాయి. గ్రామీణ సంస్కృతిని గ్లోబల్ స్టేజ్‌పై నిలబెట్టిన కుటుంబంగా వీరు పేరుపొందారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: