📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Telugu News: Uttar Pradesh: వ్యక్తి కడుపులో నుంచి బయటపడ్డ 29 స్పూన్లు, 19 టూత్‌బ్రష్‌లు

Author Icon By Pooja
Updated: September 26, 2025 • 12:50 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఒక వింత ఘటన చోటుచేసుకుంది. 35 ఏళ్ల వ్యక్తి తీవ్ర కడుపునొప్పితో ఆసుపత్రికి వెళ్లగా, వైద్యులు అతని కడుపులో ఆశ్చర్యపరిచే వస్తువులను గుర్తించారు. శస్త్రచికిత్స చేసి వైద్యులు ఏకంగా 29 స్టీల్ స్పూన్లు, 19 టూత్‌బ్రష్‌లు, రెండు పెన్నులను బయటకు తీశారు.

హాపుర్‌కు చెందిన సచిన్ అనే వ్యక్తిని కుటుంబ సభ్యులు ఇటీవల ఘజియాబాద్‌లోని ఒక డీ-అడిక్షన్ సెంటర్‌లో చేర్పించారు. అయితే అక్కడ సరైన ఆహారం ఇవ్వకపోవడం, కుటుంబం తనను వదిలి వెళ్లిపోవడంతో అతడు తీవ్ర అసహనానికి(impatient) గురయ్యాడు. రోజుకు కొన్ని చపాతీలు, కొద్దిపాటి కూర మాత్రమే ఇస్తారని, కొన్ని సార్లు ఒక్క బిస్కెట్‌తో సరిపెట్టేవారని అతడు ఆవేదన వ్యక్తం చేశాడు.

Crime: అయ్యో ఎంతపని జరిగింది చిట్టితల్లి.. పాలగిన్నెలో పడిన చిన్నారి

ఆపరేషన్‌లో వైద్యులకు దొరికిన ఆశ్చర్యకర వస్తువులు

ఈ కోపాన్ని వింతగా బయటపెట్టాలని భావించిన సచిన్, వంటగదిలోని స్పూన్లను దొంగిలించి, వాటిని బాత్రూమ్‌లో విరిచి నీళ్లతో కలిపి మింగడం ప్రారంభించాడు. అనంతరం టూత్‌బ్రష్‌లు, పెన్నులను కూడా అదే విధంగా కడుపులోకి పంపేశాడు.

కొన్ని రోజులకు గట్టిగా కడుపునొప్పి రావడంతో అతడిని అత్యవసరంగా ఆసుపత్రికి తరలించారు. ఎక్స్-రే(X-ray,), సీటీ స్కాన్‌లో కడుపులో పెద్ద ఎత్తున వస్తువులు ఉన్నట్లు తేలింది. ఎండోస్కోపీ ద్వారా తొలగించేందుకు చేసిన ప్రయత్నం విఫలమైంది. చివరికి శస్త్రచికిత్స చేసి అన్ని వస్తువులను విజయవంతంగా తొలగించారు.

“ఇలాంటి కేసులు సాధారణంగా మానసిక సమస్యలు ఉన్నవారిలో కనిపిస్తాయి” అని ఆపరేషన్ చేసిన డాక్టర్ శ్యామ్ కుమార్ తెలిపారు. ప్రస్తుతం రోగి ఆరోగ్యం స్థిరంగా ఉందని వైద్యులు వెల్లడించారు.

ఈ ఘటన ఎక్కడ జరిగింది?
ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో జరిగింది.

వ్యక్తి కడుపులో ఎన్ని వస్తువులు దొరికాయి?
29 స్టీల్ స్పూన్లు, 19 టూత్‌బ్రష్‌లు, 2 పెన్నులు దొరికాయి.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

Google News in Telugu Latest News in Telugu Man Swallows Spoons Shocking Medical Case Telugu News Today Toothbrush and Pens Uttar Pradesh News Weird Incidents India

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.