26వ అఖిల భారత పోలీస్ బ్యాండ్ పోటీల(Police Band Competition)ను రాష్ట్ర డీజీపీ బి.శివధర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై పోటీలను లాంధనంగా ప్రారంభించారు. రాష్ట్ర డీజీపీ బి. శివధర్ రెడ్డి, ఐపీఎస్, దక్షిణ మధ్య రైల్వేకు చెందిన రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పిఎఫ్) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పోటీలను మంగళవారం సికిందరాబాద్ మౌలాలీ లోని ఆర్పిఎఫ్ శిక్షణా కేంద్రంలో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ, దక్షిణ మధ్య రైల్వే అదనపు జనరల్ మేనేజర్ సత్య ప్రకాష్, దక్షిణ మధ్య రైల్వే ఐజీకమ్ ప్రిన్సివల్ దీఫ్ సెక్యూరిటీ కమిషనర్, అరోమా సింగ్ ఠాకూర్, ఇతర సీనియర్ అధికారుల సమక్షంలో పోటీలను ప్రారంభించారు.
ఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో అఖిల భారత పోలీస్ బ్యాండ్ పోటీలు
డీజీపీ బి.శివధర్ రెడ్డి అఖిల భారత పోలీస్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డు జెండాను ఆవిష్కరించి పోటీలను ప్రారంభించిన అనంతరం దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ సెక్యూరిటీ కమిషనర్ నుండి జ్ఞాపికను అందుకున్నారు. ఈ సందర్భంగా డీజీపీ శివధర్ రెడ్డి మాట్లాడుతూ ఈ పోటీలు కేవలం సంగీత నైపుణ్యాన్ని ప్రదర్శించడమే కాకుండా, భారత పోలీసు దశాలను నిర్వచించే ఐక్యత, క్రమశిక్షణ, సేవా స్ఫూర్తికి నిదర్శనంగా నిలుస్తుందిన్నారు.. అఖిల భారత పోలీస్ పోటీలను నిర్వహించడంలో దక్షిణ మధ్య రైల్వే రైల్వే రక్షణ దళం (ఆర్.పి.ఎఫ్) చేసిన ప్రయత్నాలను ఆయన అభినందించారు.
ప్రపంచంలోనే నాల్గవ అతి పెద్ద రైల్వే నెట్వర్లో ప్రయాణికుల భద్రతకు, రైల్వే ఆస్తుల రక్షణకు బాధ్యత వహించే దేశంలోని ముఖ్యమైన భద్రతా దశాలలో ఆర్పిఎఫ్ ఒకటన్నారు. ప్రతి పోలీసు బ్యాండ్ వెనుక జట్టుకృషి, క్రమశిక్షణ, అంకితభావం ఉంటాయని, ఇది పోలీసు బలగాల ప్రధాన లక్షణాలను కూడా ప్రతిబింబిస్తుందని ఆయన అన్నారు. ఈ పోటీ పాల్గొనేవారికి, ప్రేక్షకులకు ఒక చిరస్మరణీయ అనుభవంగా ఉంటుందని పరస్పర అవగాహన, సహకారాన్ని మరింత ప్రోత్సహిస్తుందని మరియు దళాల మధ్య కమ్యూనికేషన్, నమ్మకాన్ని బలోపేతం చేస్తుందన్నారు.
24 రాష్ట్రాల నుంచి 1300 మందికి పైగా పాల్గొన్న బ్యాండ్ పోటీలు
ఈ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే ఐజీకమ్ ప్రిన్సి వల్ సెక్యూరిటీ కమిషనర్. అరోమా సింగ్ ఠాకూర్(Aroma Singh Thakur) సభికులను ఉద్దేశించి 55 ఈ పోటీలో ప్రసంగిస్తూ పాల్గొనే బృందాలు విజమైన క్రీడా స్పూర్తితో వేదికను స్వీకరించాలని ఆమె పిలుపునిచ్చారు. పతకాలు గెలవడానికి కాదు, హృదయాలను గెలుచుకోవడానికి బ్యాండ్లను ఆలపించాలని ఆమె ప్రోత్సహించారు, న్యాయనిర్ణేతలను మెప్పించడం కోసమే కాకుండా, జాతి స్పూర్తిని ఉత్తేజపరిచేలా ప్రదర్శన ఇవ్వాలని ఆమె అన్నారు.
మొత్తం 24 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, కేంద్ర సాయుధ పోలీసు బలగాలు, కేంద్ర
పోలీసు సంస్థలకు చెందిన సుమారు 1300 మందికి పైగా ప్రతినిధులు ఈ బృహత్తర కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ పోటీలో బ్రాస్ బ్యాండ్, పైప్ బ్యాండ్, బ్యూగల్ డిప్నే వంటి విభాగాలలో నిర్వహించబడుతుంది. ఇందులో భారతదేశ గొప్ప. సాంస్కృతిక వైవిధ్యం మరియు దేశభక్తి ఉత్సాహాన్ని ప్రతిబింబించే సాంప్రదాయ సిద్ధమైన సమకాలీనమైన బ్యాండ్ మ్యూజిక్ కూర్పులు చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: