అహ్మదాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి లండన్ (London)బయలుదేరిన ఎయిర్ ఇండియా(Air India)విమాన ప్రమాదంలో మొత్తం 242 మంది ప్రయాణికులు మృతిచెందినట్లుగా విశ్వసిస్తున్నారు.
ఈ జాబితాలో 169 మంది భారతీయులు, 53 మంది ఇంగ్లాండ్ పౌరులు, 7 పోర్చుగల్ పౌరులు, కెనెడియన్, 12 మంది విమాన సిబ్బంది ఉన్నారు. ఈ విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపాని సైతం ఉన్నట్లు భావిస్తున్నారు.
డాక్టర్స్ హాస్టల్ భవనంపై
అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి లండన్‌కు బయల్దేరిన ఎయిరిండియా విమానం కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఎయిర్‌పోర్టుకు సమీపంలోని సివిల్ ఆస్పత్రి వద్ద డాక్టర్స్ హాస్టల్ భవనంపై ఎయిరిండియా విమానం కుప్పకూలినట్లు పోలీసు ఉన్నతాధికారి తెలిపారు.
80 శాతం వరకు సహాయక చర్యలు
ఎయిర్‌పోర్టుకు సమీపంలోని సివిల్ ఆస్పత్రి వద్ద డాక్టర్స్ హాస్టల్ భవనంపై ఎయిరిండియా విమానం కుప్పకూలినట్లు పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. విమానం కుప్పకూలిందన్న విషయం తెలిసిన 2 నుంచి 3 నిమిషాల వ్యవధిలోనే పోలీసులు, ఇతర ఏజెన్సీలు ఘటనాస్థలానికి చేరుకున్నాయని తెలిపారు. ఘటనాస్థలంలో మంటలను అదుపు చేశామని, 80 శాతం వరకు సహాయక చర్యలు పూర్తయ్యాయని పేర్కొన్నారు. ఎన్డీఆర్ఎఫ్, బీఎస్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో నిమగ్నమైనట్లు చెప్పారు. విమానం కూలిన ప్రాంతంలో రెండు భవనాలకు మంటలు అంటుకున్నాయని పోలీసు ఆఫీసర్ తెలిపారు. విమానం కూలిన సమయంలో భారీ శబ్దం వినిపించడంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు.