📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్

21వ శతాబ్దం భారత్‌దే : ప్రధాని మోడీ

Author Icon By sumalatha chinthakayala
Updated: February 11, 2025 • 1:27 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పారిస్ : ప్రధాని మోడీ భారత ఇంధన వార్షికోత్సవాలు 2024 ను వర్చువల్‌గా ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ..భారత్‌ తన సొంత వృద్ధినే కాకుండా.. ప్రపంచ వృద్ధి రేటను నడిపిస్తున్నదని ప్రధాని మోడీ పేర్కొన్నారు. 21వ శతాబ్దం భారత్‌దేనని ప్రపంచంలోని నిపుణులు చెబుతున్నారు. భారత్‌ తన సొంత వృద్ధినే కాకుండా.. ప్రపంచ వృద్ధిరేటును నడిపిస్తున్నది. మన ఇంధన రంగమూ ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తుంది.

వనరులు, మేధో సంపత్తి, ఆర్థిక బలం, రాజకీయ స్థిరత్వం, ప్రపంచ సుస్థిరతపై భారత్‌కు నిబద్ధత ఉన్నాయి. సౌర ఉత్పత్తి సామర్థ్యాన్ని రెండింతలు చేసి.. మూడో అతిపెద్ద సౌరశక్తిని ఉత్పత్తి చేసే దేశంగా నిలిచామన్నారు. మన శిలాజేత ఇంధన శక్తి మూడు రెట్లు పెరిగింది. పారిస్‌ జీ20 ఒప్పంద లక్ష్యాలను చేరుకున్న మొదటి దేశం భారత్‌ అన్నారు. రానున్న రెండు దశాబ్దాలు భారత దేశానికి అత్యంత కీలకమన్నారు. మరో ఐదేళ్లలో ముఖ్యమైన మైలురాళ్లను దాటబోతున్నాం.

2030 నాటికి నికర జీరో కర్బన ఉద్గార లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామని తెలిపారు. అంతేగాక.. ఏటా 5 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల గ్రీన్‌ హైడ్రోజన్‌ ను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు. ఇక, ప్రధాని మోడీ ప్రస్తుతం ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మేక్రాన్‌తో కలిసి మోడీ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (AI) యాక్షన్‌ కమిటీ సమావేశానికి అధ్యక్షత వహించనున్నారు.

21st century Google news india PM Modi

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.