📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Latest News: Special trains: దీపావళికి 12,000 ప్రత్యేక రైళ్లు

Author Icon By Aanusha
Updated: October 13, 2025 • 10:02 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పండగల సీజన్ వచ్చేసింది. దేశమంతా దీపావళి, ఛఠ్ పూజ వాతావరణంలో మునిగిపోయింది. ఈ సందర్భంగా ప్రజలు తమ స్వస్థలాలకు వెళ్లేందుకు పెద్ద ఎత్తున ప్రయాణాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భారతీయ రైల్వే ఒక కీలక నిర్ణయం తీసుకుంది. పండగ రద్దీని తగ్గించేందుకు, ప్రయాణికుల సౌకర్యం కోసం ఈసారి రికార్డు స్థాయిలో 12,000 ప్రత్యేక రైళ్లు (Special trains) నడపనున్నట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ (Ashwini Vaishnav) ప్రకటించారు.

Read Also: Female F4 Racer: మహిళా ఫార్ములా 4 రేసర్

సోమవారం గుజరాత్‌లోని వల్సాడ్‌లో జరిగిన రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పీఎఫ్) రైజింగ్ డే పరేడ్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా రైలు సర్వీసులు పండగ రద్దీని దృష్టిలో ఉంచుకుని విస్తరించబడుతున్నాయని తెలిపారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) నాయకత్వంలో భారతీయ రైల్వేలో చారిత్రాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయని అన్నారు.

“గడిచిన 11 ఏళ్లలో దేశవ్యాప్తంగా దాదాపు 35,000 కిలోమీటర్ల కొత్త రైల్వే ట్రాకులు వేశాం. సుమారు 60,000 కిలోమీటర్ల మేర, అంటే 99 శాతం నెట్‌వర్క్‌ను విద్యుదీకరించాం. ప్రస్తుతం 150 వందే భారత్, 30 అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు (Amrit Bharat Express trains) ప్రయాణికులకు ప్రపంచ స్థాయి సేవలు అందిస్తున్నాయి” అని ఆయన వివరించారు.

రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేయాలని

రైల్వే స్టేషన్ల ఆధునికీకరణపై కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని వైష్ణవ్ తెలిపారు. అమృత్ భారత్ స్టేషన్ పథకం (Amrit Bharat Station Scheme) కింద 1,300 రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటికే 110 స్టేషన్లను ప్రారంభించామని, మిగిలిన పనులు వేగంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు.

Special trains

ప్రయాణికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని, దేశీయంగా అభివృద్ధి చేసిన ‘కవచ్’ ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ (ఏటీపీ) వ్యవస్థను ఢిల్లీ-హౌరా, ఢిల్లీ-ముంబై వంటి ప్రధాన మార్గాల్లో వేగంగా ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.

లోకోమోటివ్‌లలో ఈ వ్యవస్థను అమర్చినట్లు

ఇప్పటికే 1,200 లోకోమోటివ్‌లలో ఈ వ్యవస్థను అమర్చినట్లు వెల్లడించారు.ప్రయాణికుల సౌకర్యార్థం ప్రతి ఏటా 7,000 కొత్త కోచ్‌లను తయారు చేస్తున్నామని, ఇందులో భాగంగా 3,500 జనరల్ కోచ్‌లను అదనంగా చేర్చామని మంత్రి తెలిపారు.

ఈ కార్యక్రమంలో భాగంగా విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచిన 41 మంది ఆర్‌పీఎఫ్ సిబ్బందిని రాష్ట్రపతి పతకాలు, జీవన్ రక్షా పతకాలతో అశ్విని వైష్ణవ్ సత్కరించారు. ఆర్‌పీఎఫ్ సిబ్బంది క్రమశిక్షణ, అంకితభావాన్ని ఆయన కొనియాడారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

Ashwini Vaishnaw Breaking News Diwali special trains Indian Railways latest news Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.