📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం

Breaking News – Army High Alert: సరిహద్దుల్లో 120 మంది టెర్రరిస్టులు?.. ఆర్మీ హైఅలర్ట్

Author Icon By Sudheer
Updated: October 21, 2025 • 8:52 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

జమ్మూ–కశ్మీర్‌లో లైన్ ఆఫ్ కంట్రోల్ (LoC) వెంబడి పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తంగా మారాయి. పాకిస్థాన్ దళాలు మరియు ఉగ్రవాద సంస్థలు జైషే మహమ్మద్ , లష్కరే తోయిబా వంటి గుంపులు సరిహద్దు ప్రాంతాల్లో చురుకుగా కదులుతున్నాయని భారత గూఢచార సంస్థలు గుర్తించాయి. సుమారు 120 మంది సాయుధ ఉగ్రవాదులు ఎల్‌ఓసీ వెంబడి చొరబడేందుకు సిద్ధంగా ఉన్నట్లు మల్టీ ఏజెన్సీల ద్వారా వచ్చిన ఇన్‌పుట్స్ ఆధారంగా ఆర్మీ అత్యంత అప్రమత్తత ప్రకటించింది. పాక్ దళాలు తరచుగా సీజ్‌ఫైర్ ఉల్లంఘిస్తూ కాల్పులకు పాల్పడుతున్న నేపథ్యంలో, భారత సైన్యం పరిస్థితిని దగ్గరగా గమనిస్తోంది.

Breaking News – Diwali Celebration : దీపావళి వేడుకలు.. 19 మందికి గాయాలు

ఆర్మీ వర్గాల ప్రకారం, ఇటీవల రెండు వారాలుగా నీలం వ్యాలీ, కేరన్ సెక్టర్, పూంచ్, రాజౌరీ ప్రాంతాల్లో అనుమానాస్పద కదలికలు కనిపించాయి. ఈ నేపథ్యంలో భారత ఆర్మీ హై అలర్ట్ ప్రకటించి, అదనపు బలగాలను మోహరించింది. గగనతల పర్యవేక్షణను పెంచి, డ్రోన్ల సాయంతో ప్రతి కదలికను గమనిస్తున్నట్లు సమాచారం. సరిహద్దు ప్రాంతాల్లో గ్రామస్తులకు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆర్మీ అధికారులు “దీపావళి సమయంలో శాంతి భద్రతను భంగపరచాలనే ఉద్దేశంతో ఉగ్రవాదులు ప్రయత్నాలు చేయవచ్చని అంచనా. అందుకే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం” అని తెలిపారు.

భారత సైన్యం, BSF, CRPF, మరియు ఇంటెలిజెన్స్ సంస్థలు సమన్వయంతో కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్లు కొనసాగిస్తున్నాయి. ప్రతి ఎంట్రీ పాయింట్ వద్ద సెక్యూరిటీ బలగాలు పహారా కాస్తున్నాయి. మరోవైపు, పాక్ మద్దతు ఉన్న ఉగ్రవాద గ్రూపులు మళ్లీ కశ్మీర్ లోపల శాంతి వాతావరణాన్ని భంగం చేయాలనే ప్రయత్నాలు చేస్తున్నాయని అధికారులు హెచ్చరించారు. దేశవ్యాప్తంగా దీపావళి వేడుకలు జరుగుతున్న వేళ, సరిహద్దు భద్రత అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. భద్రతా సంస్థల సమన్వయం వల్ల ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకోవచ్చని ఆర్మీ విశ్వాసం వ్యక్తం చేస్తోంది.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

120 Terrorists Army High Alert Google News in Telugu Indian Army on Highest Alert LOC

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.