📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం

PM Modi: నమో ప్రభుత్వానికి 11 ఏళ్లు.. సమష్ఠి విజయం పట్ల గర్విస్తున్నా.. ప్రధాని సంచలన ట్వీట్

Author Icon By Sudha
Updated: June 9, 2025 • 3:39 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi)3.0 ప్రభుత్వానికి నేటితో ఏడాది పూర్తయ్యింది. గత ఏడాది జూన్ 9న మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం (Oath taking)చేశారు. మోదీ ప్రభుత్వానికి 11 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ‘వికసిత్‌ భారత్‌కా అమృత్ కాల్’ (‘Vikasit Bharatka Amrit Kal’)అనే కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. ప్రధానిగా 11 ఏళ్ల పాలనపై నరేంద్ర మోదీ సోమవారం ఎక్స్ వేదికగా పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

PM Modi: నమో ప్రభుత్వానికి 11 ఏళ్లు.. సమష్ఠి విజయం పట్ల గర్విస్తున్నా.. ప్రధాని సంచలన ట్వీట్

సమగ్ర పురోగతిపై దృష్టి
సుపరిపాలన, అభివృద్ధిపై NDA సర్కార్ దృష్టిపెట్టిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. 11 ఏళ్లలో విభిన్న రంగాల్లో అనేక మార్పులు వచ్చాయన్నారు. సబ్‌కా సాథ్‌, సబ్‌కా వికాస్‌, సబ్‌కా విశ్వాస్‌, సబ్‌కా ప్రయాస్.. మా ఎన్డీఏ సూత్రం.. అదే లక్ష్యంతో ముందుకు వెళ్తామని ప్రధాని మోదీ స్పష్టంచేశారు. పాలనలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఆర్థిక వృద్ధి నుంచి సామాజిక అభ్యున్నతి వరకు ప్రజల సమగ్ర పురోగతిపై దృష్టి సారించామని తెలిపారు. సమష్ఠి విజయం పట్ల గర్విస్తున్నా.. వికసిత్‌ భారత్‌ నిర్మాణానికి ముందుకెళ్తున్నామని మోదీ పేర్కొన్నారు. ఈ మేరకు #11YearsOfSeva హ్యాష్ ట్యాగ్ తో ట్వీట్ చేశారు.
పూర్తి అంకితభావం
గత 11 సంవత్సరాలలో తమ ప్రభుత్వం తీసుకువచ్చిన ప్రతి పథకం పేదల సంక్షేమాన్ని నిర్ధారించడంపై దృష్టి పెట్టిందని మోదీ పేర్కొన్నారు. ఉజ్వల లేదా ప్రధానమంత్రి ఆవాస్, ఆయుష్మాన్ భారత్ లేదా భారతీయ జనౌషధి లేదా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి అయినా, ఈ పథకాలన్నీ దేశప్రజల ఆశలను నెరవేర్చాయన్నారు. ఈ సమయంలో, పూర్తి అంకితభావం, సేవా స్ఫూర్తితో ప్రజల జీవితాలను సులభతరం చేయడానికి తాము అన్ని ప్రయత్నాలు చేసామని మోదీ తెలిపారు. గత పదకొండు సంవత్సరాలుగా అనేక సానుకూల మార్పులు వచ్చాయని.. ఇవి ‘జీవన సౌలభ్యాన్ని’ పెంచాయని మోదీ పేర్కొన్నారు. నమో యాప్ ఈ పరివర్తనాత్మక ప్రయాణంలో మిమ్మల్ని ఇంటరాక్టివ్ గేమ్‌లు, క్విజ్‌లు, సర్వేలు, సమాచారం, నిమగ్నం, స్ఫూర్తినిచ్చే ఇతర ఫార్మాట్‌ల ద్వారా వినూత్న పద్ధతిలో తీసుకెళుతుందని వివరించారు. సుపరిపాలన – పరివర్తనపై స్పష్టమైన దృష్టి ని కేంద్రీకరించామని.. 140 కోట్ల మంది భారతీయుల ఆశీర్వాదాలు.. సమిష్టి భాగస్వామ్యంతో, భారతదేశం విభిన్న రంగాలలో వేగవంతమైన మార్పులను చూసిందని మోదీ పేర్కొన్నారు.

Read Also:ASP: ఐఈడి పేల్చిన మావోయిస్టు: కుంట ఏఎస్పీ అకాష్ గిర్పుంజే మృతి

#telugu News 11 years of NaMo government.. Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Modi's sensational tweet Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.