📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె

రాజస్థాన్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. 11మంది దుర్మరణం.

Author Icon By Sai Kiran
Updated: August 13, 2025 • 1:10 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రోజురోజుకు రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. పెరిగిపోతున్న వాహనాల తాకిడి.. ఇరుకైన రోడ్లు వెరసీ రోడ్డు ప్రమాదాలకు కారణాలుగా నిలుస్తున్నాయి.
తాజాగా రాజస్థాన్ (Rajasthan) లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 11మంది స్పాట్లోనే మరణించారు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

రాజస్థాన్ లోని దౌసా జిల్లాలో బుధవారం తెల్లవవారుజామున ప్యాసింజర్ పికప్ వ్యాన్ ట్రక్కును టీకొట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఏడుగురు
పిల్లలు సహా 11మంది మరణించారని ధికారులు చెప్పారు. మరో 9మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలలీసులు ఘటనా స్థలానికి
చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు చెప్పారు.

బాధితులంతా ఉత్తరప్రదేశ్కు(Uttarpradesh) చెందిన వారుగా తెలుస్తోంది. వీరంతా ఖాతు శ్యామ్, సాలాసర్ బాలాజీ ఆలయాలకు సందర్శించి తిరిగి వస్తుండగా మనో
హర్పూర్ హైవేపై తెల్లవారుజామున 4గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగిందని దౌసా పోలీసు సూపరింటెండెంట్ సాగర్ తెలిపారు.

ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన వ్యాన్పి కప్ వాహనంలో 20మంది ప్రయాణిస్తున్నారని, హైవే సర్వీస్ లేన్లో ఆగి ఉన్న లారీని వ్యాన్ ఢీకొట్టిందని అధికారులు చెప్పారు. గాయపడిన ముగ్గురు
వ్యక్తులు స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, తొమ్మిది మందిని తదుపరి వైద్యసంరక్షణ కోసం సూచించామని చెప్పారు.


తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన రాజస్థాన్ సిఎం కాగా ఈ ప్రమాదంపై రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్లాల్ శర్మ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. గాయపడ్డవారికి తగిన చికిత్స చేయాలని అధికారులను సిఎం ఆదేశించారు. గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ఎక్స్ వేదికగా సిఎం కోరారు. డ్రైవర్ నిద్రమత్తువల్ల ప్రమాదం జరిగినట్లుగా ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. వాహనం వేగంగా వచ్చి, లారీని ఢీకొట్టడంతో ప్రమాద తీవ్రత పెరిగిందని పోలీసులు చెబుతున్నారు.

Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Rajasthan rajasthan accident Road Accident Telugu News Today truck accident Uttarpradesh

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.