📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం 22 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల LIC హౌసింగ్ ఫైనాన్స్ హోం లోన్లపై శుభవార్త ముంబై–దుబాయ్ అండర్‌వాటర్ బుల్లెట్ ట్రైన్! దేశంలోనే పొడవైన డబుల్ డెక్కర్ కారిడార్ ఐఐటీ ఢిల్లీ అద్భుత ఆవిష్కరణ.. మాజీ చీఫ్ లకు నోటీసులు చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం 22 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల LIC హౌసింగ్ ఫైనాన్స్ హోం లోన్లపై శుభవార్త ముంబై–దుబాయ్ అండర్‌వాటర్ బుల్లెట్ ట్రైన్! దేశంలోనే పొడవైన డబుల్ డెక్కర్ కారిడార్ ఐఐటీ ఢిల్లీ అద్భుత ఆవిష్కరణ.. మాజీ చీఫ్ లకు నోటీసులు

Latest News: Maoists: ఛత్తీస్‌గఢ్‌లో లొంగిపోయిన 103 మంది మావోయిస్టులు

Author Icon By Aanusha
Updated: October 2, 2025 • 10:41 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఛత్తీస్‌గఢ్‌ (Chhattisgarh) లో మావోయిస్టు ఉద్యమ చరిత్రలోనే ఒక కీలక మలుపు తిరిగింది. గాంధీ జయంతి సందర్భంగా ఒకేసారి 103 మంది మావోయిస్టులు హింసా మార్గాన్ని శాశ్వతంగా వీడి, ప్రజాస్రవంతిలో కలిసిపోయారు. ఈ ఘటన బీజాపూర్ జిల్లాలో ఘనంగా జరిగింది. పోలీసు, పారామిలటరీ ఉన్నతాధికారుల సమక్షంలో జరిగిన కార్యక్రమంలో మావోయిస్టులు తమ వద్ద ఉన్న ఆయుధాలను సమర్పించి అధికారుల ముందు లొంగిపోయారు.

Crime: ప్రభుత్వ ఉద్యోగం పోతుందనే భయంతో.. బిడ్డను అడవిలో పారేసిన దంపతులు

లొంగిపోయిన వారిలో 49 మందిపై ఏకంగా రూ.1.06 కోట్ల రివార్డు ఉండటం గమనార్హం. వీరిలో డివిజనల్ కమిటీ సభ్యులు, ఏరియా కమిటీ సభ్యులు, మిలీషియా కమాండర్లు వంటి కీలక నేతలు కూడా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘పూనా మర్గం’ (నవ జీవన మార్గం) అనే పునరావాస కార్యక్రమం కింద వీరంతా లొంగిపోయారు.

ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం తక్షణ సాయంగా రూ.50,000 చెక్కును అందించింది.మావోయిస్టు (Maoists) సిద్ధాంతాలపై నమ్మకం కోల్పోవడం, సంస్థలో అంతర్గత విభేదాలు, ప్రశాంతమైన కుటుంబ జీవితం గడపాలన్న ఆకాంక్ష వంటి కారణాలతోనే వారు లొంగిపోయినట్లు అధికారులు తెలిపారు.

Maoists

జనజీవన స్రవంతిలోకి తీసుకురావడంలో కీలకపాత్ర

సీనియర్ నాయకులు ఎన్‌కౌంటర్లలో (encounters) మరణించడం, ప్రజల నుంచి మద్దతు కరవవడం కూడా మావోయిస్టుల పతనానికి కారణమవుతోందని వారు విశ్లేషించారు.ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం అమలు చేస్తున్న బహుముఖ వ్యూహం సత్ఫలితాలనిస్తోందని సీనియర్ పోలీసు అధికారులు చెబుతున్నారు.

కొత్తగా భద్రతా క్యాంపులు ఏర్పాటు చేయడం, రోడ్లు, విద్యుత్, నీటి వసతులు కల్పించడం, కమ్యూనిటీ పోలీసింగ్ వంటివి మావోయిస్టులను జనజీవన స్రవంతిలోకి తీసుకురావడంలో కీలకపాత్ర పోషిస్తున్నాయని వారు పేర్కొన్నారు.ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు బీజాపూర్‌ జిల్లా (Bijapur district) లో 421 మంది మావోయిస్టులను అరెస్టు చేయగా, 410 మంది లొంగిపోయారు.

137 మంది వివిధ ఎన్‌కౌంటర్లలో మరణించారు. ఈ భారీ లొంగుబాటు కేవలం భద్రతా బలగాల వ్యూహాత్మక విజయంగానే కాకుండా, హింసాత్మక సిద్ధాంతంపై శాంతి సాధించిన విజయంగా అధికారులు భావిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

103 maoists surrender Bijapur Maoists Breaking News Chhattisgarh Maoists latest news naxal rehabilitation naxalites surrender poona margam Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.