భారతదేశంలో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (GCC) వేగంగా విస్తరిస్తున్నాయి. దేశీయ ప్రతిభ, టెక్నాలజీ ఎకోసిస్టం, నైపుణ్యాల్లో పెరుగుతున్న నమ్మకం కారణంగా ప్రపంచంలోని ప్రముఖ కంపెనీలు తమ GCCలను భారత్‌లో ఏర్పాటు చేయడానికి పెద్ద ఎత్తున ముందుకు వస్తున్నాయి. రాబోయే సంవత్సరాల్లో యువతకు భారీ ఉపాధి అవకాశాలు రాబోతున్నాయి.
Read Also: Sabarmati: సబర్మతీ జైలులో డాక్టర్‌పై దాడి
2030 నాటికి 34.6 లక్షలకు
వచ్చే ఐదేళ్లలో కొత్తగా 13 లక్షల ఉద్యోగాలు రానున్నాయి. ‘GCCల సంఖ్య వేగంగా పెరుగుతోంది. వీటిలో పని చేసే ఉద్యోగుల సంఖ్య 2026 నాటికి 24 లక్షలకు, 2030 నాటికి 34.6 లక్షలకు చేరుకుంటుంది’ అని NLB సర్వీసెస్ రిపోర్టు వెల్లడించింది. దేశంలో 1800కు పైగా GCCల్లో ఏఐ నిపుణులకు ప్రాధాన్యం లభిస్తోందని తెలిపింది. అత్యధికంగా హైదరాబాద్‌లో ఈ ఏడాది 41 GCCలు ఏర్పాటయ్యాయి.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: