📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

సెలబ్రిటీలపై పెరుగుతున్న దాడులు

Author Icon By Vanipushpa
Updated: January 16, 2025 • 3:19 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

దేశ ఆర్థిక రాజధాని ముంబైలోని బాంద్రా ప్రాంతం అంటే.. అక్కడ చాలా పెద్ద పెద్ద సెలబ్రిటీలు నివసిస్తూ ఉంటారు. అయితే సెలబ్రిటీల నివాసాలు అంటే హై సెక్యూరిటీ ఉంటుంది. అక్కడ నిఘా, బందోబస్తు కూడా పటిష్ఠంగానే ఉంటుంది. కానీ బాంద్రాలో కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు.. సెలబ్రిటీలకు తీవ్ర ఆందోళనకరంగా మారుతున్నాయి. ఎన్సీపీ నేత, మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిఖీని అతి దారుణంగా నడిరోడ్డుపై హత్య చేయడం.. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌ ఇంటి ముందు కాల్పులు, బెదిరింపులు.. తాజాగా సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి ఆగంతకుడు చొరబడి ఆయనపై తీవ్రంగా దాడి చేయడంతో ఇప్పుడు బాంద్రా పేరు మారుమోగిపోతోంది.

సైఫ్ అలీ ఖాన్‌పై దాడి జరిగిన తర్వాత.. ముంబైలో భద్రతపై ప్రియాంక చతుర్వేది పలు ప్రశ్నలు లేవనెత్తారు. సైఫ్ అలీ ఖాన్‌పై దాడి జరగడం.. ముంబై పోలీసులపై, రాష్ట్ర హోంమంత్రిపై మరోసారి ప్రశ్నలను లేవనెత్తుతోందని ఆమె పేర్కొన్నారు. పెద్ద పెద్ద వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని వారిపై దాడులు చేస్తూ.. ముంబై నగరాన్ని బలహీనపరిచే ప్రయత్నం జరగడాన్ని ఈ ఘటన చూపిస్తుందని తెలిపారు. మహారాష్ట్ర మాజీ మంత్రి, ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీ దారుణ హత్య తర్వాత.. ఇప్పటికీ ఆయన కుటుంబం న్యాయం కోసం ఎదురు చూస్తోందని మండిపడ్డారు. హై ప్రొఫైల్ ప్రాంతం అయిన బాంద్రాలోనే ఇలాంటి పరిస్థితులు ఉంటే ఇక నగరంలోని మిగిలిన ప్రాంతాలు, సాధారణ ప్రజలకు రక్షణ ఏది అంటూ దేవేంద్ర ఫఢ్నవీస్ నేతృత్వంలోని మహాయుతి కూటమి ప్రభుత్వంపై ప్రతిపక్ష ఉద్ధవ్ ఠాక్రే శివసేన పార్టీ తీవ్రంగా మండిపడుతోంది.

Attacks celebrities Mumbai Saif Ali Khan Salman Khan

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.