📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

సింధు లిపి గుట్టు విప్పితే రూ.8.66 కోట్లు ఇస్తామన్న సీఎం స్టాలిన్

Author Icon By Vanipushpa
Updated: January 18, 2025 • 11:32 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రపంచంలోని అత్యంత పురాతన పట్టణ నాగరికతల్లో ఒకటైన సింధు, హరప్పా నాగరికత 5,300 ఏళ్ల క్రితం ప్రస్తుత వాయవ్య భారత్‌, పాకిస్తాన్‌లలో విలసిల్లింది. ఈ నాగరికత క్షీణత వెనుక కారణాలు అస్పష్టంగానే ఉన్నాయి. అక్కడ యుద్ధం, కరవు, లేదా ప్రకృతి వైపరీత్యాలు సంభవించినట్లుగా స్పష్టమైన ఆధారాలేవీ లేవు. ఆ నాగరికత కాలం నాటి లిపిని అర్థం చేసుకోవడం అతిపెద్ద మిస్టరీగా మిగిలిపోయింది. ఈ కారణంగా ఆనాటి భాష, పాలన, నమ్మకాలు ఎవరికీ అంతుబట్టని విషయాలుగా మిగిలిపోయాయి. తరతరాలుగా పండితులకే అంతుబట్టకుండా ఉన్న ఒక పురాతన లిపిని అర్థం చేసుకున్నామంటూ కంప్యూటర్ సైంటిస్ట్ అయిన రాజేశ్ పీఎన్ రావుకు ప్రతీ వారం ప్రజల నుంచి ఈమెయిళ్లు వస్తుంటాయి.

అయితే ఈ లిపి గుట్టు విప్పే ప్రయత్నాలను మరింత ప్రోత్సహించేందుకు తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఇటీవల సింధు లోయ లిపి గురించి ఒక ప్రకటన చేశారు. ఈ లిపిని సరిగ్గా డీకోడ్ చేసినవారికి 10 లక్షల డాలర్లు(సుమారు రూ. 8.66 కోట్లు) నజరానా అందిస్తామని స్టాలిన్ ప్రకటించారు. దీంతో ఈ లిపిని డీకోడ్ చేసే ప్రయత్నాలు మరింత ఊపందుకున్నాయి. ఈ లిపిని అర్థం చేసుకున్నామని చెప్పేవారిలో ఇంజినీర్లు, ఐటీ నిపుణుల నుంచి పదవీ విరమణ చేసినవారు, టాక్స్ ఆఫీసర్ల వరకు ఉంటారు. వీరిలో అత్యధికులు భారతీయులు లేదా విదేశాల్లో నివసిస్తోన్న భారత సంతతి ప్రజలే. వారంతా సింధు లోయ నాగరికత లిపిని అర్థం చేసుకున్నామని చెబుతుంటారు.

cm stalin million dollar sindu lipi

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.