📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం

స‌హజీవ‌నం త‌ప్పు: నితిన్ గ‌డ్క‌రీ

Author Icon By Vanipushpa
Updated: December 19, 2024 • 3:22 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

స‌హ‌జీవ‌నంపై కేంద్ర మంత్రి నితిన గ‌డ్క‌రీ సంచల కామెంట్ చేశారు. అది త‌ప్పుడు విధాన‌మ‌న్నారు. స‌మాజానికి వ్య‌తిరేకం అన్నారు. యూట్యూబ్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేశారు. ఈ స‌హజీవ‌నం సంస్కృతి మనది కాదని, ఇది విదేశీ విధానమని, అంతేకాదు ఇది త‌ప్పుడు విధాన‌మ‌ని కేంద్ర మంత్రి నితిన్ గ‌డ్క‌రీ అన్నారు. ఇది స‌మాజ సిద్ధాంతాల‌కు వ్య‌తిరేక‌మ‌న్నారు.
స్వ‌లింగ సంప‌ర్కుల వివాహాలు మంచిది కాదు
స్వ‌లింగ సంప‌ర్కుల వివాహాల‌తో.. సామాజిక వ్య‌వ‌స్థ దెబ్బ‌తింటుంద‌ని ఆయ‌న ఆరోపించారు. యూట్యూబ్ పోడ్‌కాస్ట్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆయ‌న ఈ అభిప్రాయాలు వ్య‌క్తం చేశారు. బ్రిట‌న్‌లో అతి పెద్ద స‌మ‌స్య స‌హ‌జీవ‌న‌మే అని, పెళ్లిని వ్య‌తిరేకించ‌డం పెద్ద స‌మ‌స్య‌గా మారిన‌ట్లు ఇటీవ‌ల బ్రిటీష్ పార్ల‌మెంట్ వెళ్లిన‌ప్పుడు అక్క‌డ త‌మ‌కు తెలిసింద‌న్నారు. ఒక‌వేళ మీరు పెళ్లి చేసుకోక‌పోతే, అప్పుడు మీరెలా పిల్ల‌ల్ని కంటార‌ని గ‌డ్క‌రీ అడిగారు. ఒక‌వేళ పిల్లలు పుడితే, వాళ్ల భ‌విష్య‌త్తు ఏంటి ఆయ‌న ప్ర‌శ్నించారు. స‌మాజ వ్య‌వ‌స్థ‌కు వ్య‌తిరేకంగా వెళ్తే, అది ప్ర‌జ‌ల‌పై ఎటువంటి ప్ర‌భావం చూపుతుంద‌ని ప్ర‌శ్నించిన‌ట్లు తెలిపారు.
స‌మాజం త‌నంతటే తాను నిర్ణ‌యాలు తీసుకుంటుంద‌ని, కానీ దేశంలో లింగ నిష్ప‌త్తి స‌మంగా ఉండే విధంగా చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. ఒక‌వేళ 1500 మంది మ‌హిళ‌లు, 1000 మంది పురుషులు ఉంటే, అప్పుడు ఇద్ద‌రు భార్య‌ల‌కు పురుషుల అర్హుల‌ని ఆయ‌న అన్నారు. ఆద‌ర్శ భార‌త దేశంలో విడాకుల్ని బ్యాన్ చేయాల‌న్న దాన్ని ఆయ‌న ఖండించారు. స‌హ‌జీవనం మంచిది కాద‌న్నారు. సేమ్ సెక్స్ మ్యారేజ్‌ను వ్య‌తిరేకిస్తూ గ‌త ఏడాది సుప్రీంకోర్టుకు చెందిన అయిదుగురు స‌భ్యుల ధ‌ర్మాస‌నం తీర్పు ఇచ్చిన విష‌యం తెలిసిందే.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.