📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సంక్రాంతి ఎందుకు జరుపుకుంటారు? 12 రోజుల పండుగ పూర్తి కథనం ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ ఈరోజు బంగారం ధరలు మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సంక్రాంతి ఎందుకు జరుపుకుంటారు? 12 రోజుల పండుగ పూర్తి కథనం ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ ఈరోజు బంగారం ధరలు

రైల్వే శాఖలో 32 వేల ఉద్యోగాలు

Author Icon By Vanipushpa
Updated: January 4, 2025 • 3:20 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

నూతన సంవత్సరంలో నిరుద్యోగులకు రైల్వే శాఖలో 32 వేల ఉద్యోగాలు రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది.
ఎంతోకాలంగా నిరుద్యోగులు ఎదురుచూస్తున్న ఉద్యోగాల ప్రకటన వెలువడింది.
రైల్వే శాఖలోని పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న దాదాపు 32వేల లెవెల్ 1 (గ్రూపు డి ) పోస్టుల భర్తీకి రైల్వే బోర్డు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో విద్యార్హతల విషయంలో కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఈ ఉద్యోగాల భర్తీకి అవసరమైన కనీస విద్యార్హత ప్రమాణాలను సడలించింది. ఇటీవల విడుదలైన నోటీసులో టెక్నికల్ విభాగాల్లో పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు కనీస విద్యార్హత పదో తరగతితో పాటు ఎన్ఏసీ సర్టిఫికెట్ లేదా ఐటీఐ డిప్లొమా కలిగి ఉన్న వారిని మాత్రమే అర్హులుగా పేర్కొన్నది. అయితే తాజగా, ఆ విద్యార్హత ప్రమాణాలను సడలిస్తూ నిర్ణయం ప్రకటించింది. కొత్త ప్రమాణాల ప్రకారం.. పదో తరగతి లేదా ఐటీఐ డిప్లొమా లేదా నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్ జారీ చేసిన నేషనల్ అప్రెంటిషిప్ సర్టిఫికెట్ కలిగిన ఎవరైనా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

32 వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

రైల్వే శాఖలోని పలు విభాగాల్లో పాయింట్స్‌మన్, అసిస్టెంట్, ట్రాక్ మెయింటెయినర్ సహా దాదాపు 32 వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాలకు జనవరి 23 నుంచి ఫిబ్రవరి 22 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు స్వీకరించనున్నారు.

Also Ready: నేటి నుంచి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అమలు

ట్రాఫిక్, ఇంజనీరింగ్, మెకానికల్, ఎలక్ట్రికల్ విభాగాల్లో ఈ పోస్టుల భర్తీకి వయో పరిమితి (జనవరి 7, 2025 నాటికి) 18 నుంచి 36 ఏళ్ల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగ అభ్యర్ధులకు వయో సడలింపు కల్పించారు. కంప్యూటర్ ఆధారిత పరీక్షతో పాటు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నారు. ప్రారంభ జీతం రూ.18వేలు.


educational criteria railway board Railway Jobs railways recruitment

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.