📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం

మోడీని పలు అభివృద్ధి పనుల అనుమతిని కోరిన రేవంత్ రెడ్డి

Author Icon By Vanipushpa
Updated: January 6, 2025 • 3:17 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

సోమవారం చర్లపల్లి రైల్వే టెర్మినల్ ను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీని సీఎం రేవంత్ రెడ్డి పలు అభివృద్ధి పనుల చిట్టాను విప్పినట్లు తెలుస్తున్నది. ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి మాట్లడుతూ చర్లపల్లి టెర్మినల్ ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సోమవారం ఉదయం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా వర్చువల్‌గా చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభమైంది.

ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ పాల్గొని ప్రసంగించారు. రైల్వే టెర్మినల్ పూర్తి చేసినందుకు ప్రధానికి తెలంగాణ ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేశారు. ప్రధాని కోరుకుంటున్న 5 ట్రిలియన్ ఎకానమీ సకారం కావాలంటే అన్ని రాష్ట్రాల అభివృద్ధి జరగాలని అన్నారు. తెలంగాణ రాష్ట్రం కూడా ఇందులో భాగస్వామ్యం కావాలని కోరుకుంటుందన్నారు. డ్రైపోర్ట్ ఏర్పాటు చేస్తే రాష్ట్రాభివృద్ధికి కూడా ఉపయోగకరంగా ఉంటుందని వెల్లడించారు.

బందర్ పోర్ట్‌కు రైల్వే లైన్‌కు అనుమతి ఇవ్వాలని కోరుతున్నట్లు తెలిపారు. తెలంగాణలో డ్రైపోర్ట్ ఏర్పాటు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. తెలంగాణ ఫార్మా ఇండస్ట్రీకి కేరాఫ్ అడ్రస్‌గా ఉందన్నారు. ఎలక్ట్రిక్ వేహికిల్ తయారీకి అనుమతి ఇవ్వాలని కోరారు.

రీజనల్ రింగ్ రోడ్డు 374 కిలోమీటర్ల నిర్మాణం జరుగుతోందని.. రీజనల్ రైల్ అవసరం కూడా ఉందన్నారు. రైల్ రింగ్‌కు అనుమతి ఇవ్వాలని కోరుతున్నట్లు తెలిపారు. వికారాబాద్ నుంచి కొడంగల్ మీదుగా కర్ణాటకకు రైల్వే లైన్ నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని కోరారు.
అభివృద్ధి కార్యక్రమాలకు అనుమతి కోరిన రేవంత్
కాగా.. సికింద్రాబాద్‌, నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్‌లపై ఒత్తిడి తగ్గించి, నగరంలో ట్రాఫిక్‌ రద్దీని నివారించేందుకు నాల్గో టెర్మినల్‌గా చర్లపల్లి రూపుదిద్దుకున్న విషయం తెలిసిందే. ఆరున్నరేళ్ల కాల వ్యవధిలో దాదాపు రూ.428 కోట్లతో నిర్మితమైన ఈ టెర్మినల్‌ అందుబాటులోకి వస్తే శివారు ప్రాంతాలకు చెందిన ప్రయాణికులకు మరింత మెరుగైన రవాణా సౌకర్యం కలుగుతుంది.

devlopment works narendra modi and revanth reddy Telangana

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.