📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

మరో క్రికెట్‌ స్టార్‌ జంట విడాకులు?

Author Icon By Vanipushpa
Updated: January 4, 2025 • 5:34 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇటీవల సెలబ్రిటీ జంటలు ఎక్కువ శాతం విడాకులు తీసుకుంటున్నారు. తాజాగా
భారత క్రికెట్‌ టీమ్‌లో మరో జంట విడాకులకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. మరో క్రికెట్‌ స్టార్‌ జంట విడాకులు, సోషల్‌ మీడియాలో రీల్స్‌తో ఫ్యాన్స్‌ను అలరిస్తున్న భార‌త స్టార్ స్పిన్నర్ య‌జ్వేంద్ర చాహ‌ల్ ధనశ్రీ వర్మ జంట విడాకులు తీసుకోబోతోందంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోన్న విషయం తెలిసిందే.

ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో

ఈ రూమర్స్‌ నేపథ్యంలో తాజాగా మరో క్రికెట్‌ స్టార్‌ జంట విడాకులు, ఈ స్టార్‌ జంట ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు ధనశ్రీతో ఉన్న ఫొటోలను కూడా చాహల్‌ తొలగించాడు. మరోవైపు ఈ జంట విడిపోవడానికి నిర్ణయించుకున్నట్లు సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. త్వరలోనే విడాకులు తీసుకోబోతున్నారంటూ తెలిపాయి. అందుకు ఖచ్చితమైన కారణాలు మాత్రం చెప్పలేదు. విడాకులు అధికారికం కావడానికి మరికొంత సమయం పట్టొచ్చని పేర్కొన్నారు.

Also Read: ఛాంపియన్స్ ట్రోఫీతో కోట్ల వర్షం

దంత వైద్యురాలుగా పనిచేస్తున్న ధ‌న‌శ్రీ
చాహ‌ల్.. దంత వైద్యురాలైన‌ ధ‌న‌శ్రీ 2020 డిసెంబ‌ర్ 22న పెండ్లి చేసుకున్నారు. కొరియోగ్రాఫర్‌గా, సోషల్‌మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌గా త‌న‌కంటూ గుర్తింపు తెచ్చుకుంది ధనశ్రీ‌. పెళ్లి తర్వాత వీళ్లిద్దరూ ఇన్‌స్టాలో రీల్స్ చేస్తూ ఫ్యాన్స్‌ను అల‌రిస్తూనే ఉన్నారు. అయితే, ఇటీవలే ధనశ్రీ తన పేరు నుంచి ‘చాహల్‌’ నేమ్‌ను తీసేయడంతో ఈ జంట విడాకులు తీసుకోబోతోందంటూ పుకార్లు వ్యాపించాయి. ఆ తర్వాత చాహల్‌ సైతం ‘న్యూ లైఫ్‌ లోడెడ్‌’ అంటూ ఇన్‌స్టా స్టోరీస్‌లో రాసుకొచ్చాడు. దీంతో వీరు విడాకులు తీసుకోవడం ఖాయం అని ప్రచారం జరిగింది. ఈ క్రమంలోనే వీరు తమ సోషల్‌ మీడియా ఖాతాలో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడంతో ఆ వార్తలకు మరింత ఆజ్యంపోసినట్లైంది. మరోవైపు ఈ జంట విడిపోవడానికి నిర్ణయించుకున్నట్లు సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. త్వరలోనే విడాకులు తీసుకోబోతున్నారంటూ తెలిపాయి. అందుకు ఖచ్చితమైన కారణాలు మాత్రం చెప్పలేదు. విడాకులు అధికారికం కావడానికి మరికొంత సమయం పట్టొచ్చని పేర్కొన్నారు.

Also Read: హోంమంత్రికి షాక్ ఇచ్చిన చంద్రబాబు

Divorce yuzvendra chahal couple

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.