కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్ పర్సన్, రాజ్యసభ సభ్యురాలు సోనియా గాంధీ ఢిల్లీలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ భౌతికకాయానికి నివాళులు అర్పించారు.
సోనియా గాంధీ నిన్న అస్వస్థతకు గురయ్యారు. అయితే, పార్టీలో కురువృద్ధుడిగా పేరుగాంచిన మన్మోహన్ సింగ్ తుదిశ్వాస విడిచిన నేపథ్యంలో, ఆమె తన కుటుంబ సభ్యులతో కలిసి నేడు మన్మోహన్ నివాసానికి వచ్చారు. మన్మోహన్ సింగ్ పార్థివదేహంపై పుష్పగుచ్ఛం ఉంచి నివాళులు అర్పించారు. మన్మోహన్ సింగ్ కుటుంబ సభ్యులను సోనియా పరామర్శించారు. ఆమె వెంట తనయుడు రాహుల్ గాంధీ ఉన్నారు.
మన్మోహన్ భౌతికకాయానికి సోనియా నివాళి
By
Vanipushpa
Updated: December 27, 2024 • 4:02 PM
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.