📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

బ్రాహ్మణ జంటలకు మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం వినూత్న ఆఫర్

Author Icon By Vanipushpa
Updated: January 13, 2025 • 3:56 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

యువ బ్రాహ్మణ దంపతులకు మధ్యప్రదేశ్‌ ప్రభుత్వ బోర్డు వినూత్న ఆఫర్ ఇచ్చింది. బ్రాహ్మణ యువ జంటలు నలుగురు పిల్లలను కంటే రూ.లక్ష బహుమతిగా ఇస్తామని ప్రకటించింది. మధ్యప్రదేశ్‌కు చెందిన పరుశురామ్‌ కళ్యాణ్‌ బోర్డు అధ్యక్షుడు పండిట్‌ విష్ణు రజోరియా ఈ ప్రకటన చేశారు. రాష్ట్ర క్యాబినెట్‌ హోదాలో ఉన్న ఆయన ఇలాంటి ప్రకటన చేయడం చర్చనీయాంశంగా మారింది.
మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లో జరిగిన బ్రాహ్మణ కమ్యూనిటీకి సంబంధించిన కార్యక్రమంలో రజోరియా మాట్లాడుతూ.. దేశంలో నాస్తికుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నదని అన్నారు. మనం కుటుంబాలపై దృష్టి సారించకపోవడమే ఇందుకు కారణమని అన్నారు. ‘నాకు యువత మీద చాలా ఆశలు ఉన్నాయి. వయసుపైడిన వారిపై పెద్దగా ఆశలు పెట్టుకోలేం. జాగ్రత్తగా వినండి. భవిష్యత్‌ తరాన్ని రక్షించాల్సిన బాధ్యత మీపైనే ఉంది. యువత జీవితంలో సెటిలై ఒక సంతానంతో సరిపెట్టుకుంటున్నారు. ఇది పెద్ద సమస్య అయిపోయింది. ప్రతి జంట నలుగురు పిల్లలను కనాలని నేను మిమ్ములను కోరుతున్నా’ అని రజోరియా సూచించారు.

నలుగురు పిల్లలను కంటే ఆ బ్రాహ్మణ జంటకు పరుశురామ్‌ కళ్యాణ్‌ బోర్డు రూ.లక్ష బహుమతి ఇస్తుందని రజోరియా చెప్పారు. బోర్డు అధ్యక్షుడిగా తాను ఉన్నా లేకున్నా ఈ నగదు పురస్కారం ఇవ్వబడుతుందని అన్నారు.

అనంతరం రజోరియా ఓ జాతీయ ఛానెల్‌తో మాట్లాడుతూ.. ఈ ప్రకటన పూర్తిగా తన వ్యక్తిగతమని, ఈ ప్రకటనతో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని అన్నారు. బ్రాహ్మణ కులానికి సంబంధించిన కార్యక్రమంలో తాను ఈ ప్రకటన చేశానని చెప్పారు. పిల్లలను చదివించడం, ఉన్నత స్థానాలకు చేర్చడం బ్రాహ్మణ సమాజానికి పెద్ద కష్టమేమీ కాదని అన్నారు.

Brahmin Couples Madhya Pradesh Pandit Vishnu Rajoria

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.