📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

బీఎస్ఎన్ఎల్ సరికొత్త ప్లాన్

Author Icon By Vanipushpa
Updated: December 30, 2024 • 1:13 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఏడాది కంటే ఎక్కువ రోజుల వ్యాలిడిటీతో సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను బీఎస్ఎన్ఎల్ తీసుకొచ్చింది. తరచూ రీఛార్జ్‌లు చేసుకోవాల్సిన అవసరం లేకుండా రూ.2398 ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 425 రోజులు ఉంటుందని బీఎస్ఎన్ఎల్ తెలిపింది.
రిలయన్స్ జియో, భారతి ఎయిర్‌టెల్, వీ (వొడాఫోన్ ఐడియా) వంటి ప్రైవేటు టెలికం ఆపరేటర్లు జులై నెలలో రీఛార్జ్ ప్లాన్ ధరలను గణనీయంగా పెంచిన విషయం తెలిసిందే. దీంతో చౌకైన ఆఫర్ల కోసం చాలామంది కస్టమర్లు ప్రభుత్వరంగ టెలికం కంపెనీ బీఎస్ఎన్ఎల్ వైపు చూశారు. ఇప్పటికే లక్షలాది మంది పోర్ట్ అయ్యారు. మరింతమంది కష్టమర్లను ఆకర్షించడమే లక్ష్యంగా బీఎస్ఎన్ఎల్ మరో బ్రహ్మాండమైన ప్లాన్‌ను పరిచయం చేసింది.

అదనపు ప్రయోజనాలు
ఈ ప్రమోషనల్ ఆఫర్ ప్రస్తుతానికి జమ్మూ కశ్మీర్ ప్రాంతంలోని వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. దేశంలోని మిగతా రాష్ట్రాలలో కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అయితే, ఎప్పటిలోగా అందుబాటులోకి తీసుకొస్తారనే దానిపై బీఎస్ఎన్ఎల్ స్పష్టత ఇవ్వలేదు.

ఈ రీఛార్జ్ ప్లాన్‌లో అన్ని నెట్‌వర్క్‌లకు అపరిమిత కాలింగ్‌ చేసుకోవచ్చు. ఏకంగా 850జీబీ డేటా లభిస్తుంది. రోజుకు 2జీబీ డేటాతో ఇది సమానం. రోజువారీ డేటా పరిమితి పూర్తయిన తర్వాత ఇంటర్నెట్ స్పీడ్ 40కేబీపీఎస్‌కు తగ్గిపోతుంది. అదనపు ప్రయోజనాలలో భాగంగా ప్రతిరోజూ 100 ఎస్ఎంఎస్‌లను ఉచితంగా పంపించుకోవచ్చు.

BSNL recharge officer

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.