📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ

బంగ్లా జైలు నుంచి అబ్దుస్ సలాం విడుదల

Author Icon By Vanipushpa
Updated: December 26, 2024 • 1:21 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బంగ్లా జైలు నుంచి అబ్దుస్ సలాం పింటు విడుదల అయ్యారు. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా సన్నిహితుల్లో ఒకడిగా చెప్పుకునే అబ్దుస్ విడుదలపై అటు బంగ్లాదేశ్, ఇటు భారత్‌లోనూ ఆందోళన వ్యక్తమవుతోంది. షేక్ హసీనాను తమకు అప్పగించాలని భారత్‌ను డిమాండ్ చేస్తున్న బంగ్లాదేశ్ ప్రభుత్వం.. మరోవైపు భారత్‌కు అత్యంత ప్రమాదకారి అయిన అబ్దుస్ సలాం పింటును జైలు నుంచి విడుదల చేసి తన ద్వంద్వ వైఖరిని చాటుకుంది. భారత్‌పై దాడికి ఉగ్రవాదులకు అబ్దుస్ సాయం చేశాడు.
విద్యాశాఖ మంత్రిగా ..
ఖలీదా జియా ప్రభుత్వంలో పింటు బంగ్లాదేశ్ విద్యాశాఖ మంత్రిగా పనిచేశాడు. ఈ సందర్భంగా భారత్‌తోపాటు హసీనాపై ఎన్నో కుట్రలు పన్నాడు. ఉగ్రవాదులకు నిధులు సమకూర్చిన కేసులో అరెస్టయ్యాడు. పాకిస్థాన్‌లో ఉగ్రవాదులకు నిధులు సమకూర్చడం ద్వారా వారు జమ్మూకశ్మీర్ ద్వారా భారత్‌కు హాని చేయాలని కుట్ర పన్నారు.
ఉగ్రవాద గ్రూపులకు ఆర్థిక సాయం
2001 నుంచి 2006 వరకు ఖలీదా జియా బంగ్లాదేశ్‌ను పాలించారు. ఆ సమయంలో పాకిస్థాన్‌లోని పలు ఉగ్రవాద గ్రూపులకు బంగ్లాదేశ్ నుంచి ఆర్థిక సాయం అందింది. ఫలితంగా భారత్‌పై దాడులకు ప్రయత్నం జరిగింది. ప్రభుత్వం మారిన తర్వాత పింటుపై దర్యాప్తు మొదలైంది. ఈ సందర్భంగా ఆయన బంగ్లాదేశ్ చరిత్రలోనే అత్యంత ప్రమాదకర మంత్రి అన్న విషయం వెలుగులోకి వచ్చింది.
అందరిలోనూ మరో ఆందోళన

ఇప్పుడాయన విడుదలతో అందరిలోనూ మరో ఆందోళన మొదలైంది. ఆయన ఎక్కడ మంత్రి అవుతాడోనని ఆందోళన చెందుతున్నారు. అయితే, ఖలీదా జియాకు ఆయన అత్యంత సన్నిహితుడు కావడంతో మంత్రి అయ్యే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయని చెబుతున్నారు.

Abdus Salam Pintu release from jail

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.