हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

ప్ర‌వాసీ భార‌తీయ ఎక్స్‌ప్రెస్‌ రైలును ప్రారంభించిన మోదీ

Vanipushpa
ప్ర‌వాసీ భార‌తీయ ఎక్స్‌ప్రెస్‌ రైలును ప్రారంభించిన మోదీ

మోడీ మూడవసారి పీఎం అయ్యాక పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ప్ర‌వాసీ భార‌తీయ ఎక్స్‌ప్రెస్ రైలును ప్ర‌ధాని మోదీ ప్రారంభించారు. భువ‌నేశ్వ‌ర్‌లో జ‌రుగుతున్న 18వ ప్ర‌వాసీ భార‌తీయ దివ‌స్ సంద‌ర్భంగా ఇవాళ ఈ రైలును ఆయ‌న వ‌ర్చువ‌ల్‌గా ప్రారంభించారు. ఎన్ఆర్ఐ టూరిస్టుల కోసం ఈ రైలును స్టార్ట్ చేశారు. విదేశీ భార‌తీయుల కోసం కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌వాసీ భార‌తీయ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభించింది. భువ‌నేశ్వ‌ర్‌లో జ‌రుగుతున్న 18వ ప్ర‌వాసీ భార‌తీయ దివ‌స్ సంద‌ర్భంగా ఈ రైలును వ‌ర్చువ‌ల్‌గా ప్ర‌ధాని మోదీ ప్రారంభించారు.
ఎన్ఆర్ఐ టూరిస్టుల కోసం ఈ రైలును స్టార్ట్ చేశారు. ఢిల్లీలోని నిజాముద్దీన్ రైల్వే స్టేష‌న్ నుంచి ఈ రైలు బ‌య‌లుదేరింది. మూడు వారాల జ‌ర్నీ ఉంటుంది. దేశంలోని ప‌లు సంప్ర‌దాయ‌, మ‌త‌ప‌ర‌మైన ప్ర‌దేశాల‌ను ఆ రైలు చుట్టివ‌స్తుంది.

ప్ర‌వాసీ భార‌తీయ ఎక్స్‌ప్రెస్‌ను.. ప్ర‌త్యేక టూరిస్టు రైలును రూపొందించారు. విదేశాల్లో ఉన్న భార‌తీయుల కోసం ఈ టూరిస్టు రైలు కాన్సెప్ట్‌ను డెవ‌ల‌ప్ చేశారు. 45 ఏండ్ల నుంచి 65 ఏండ్ల మ‌ధ్య ఉన్న‌వారు ఈ రైలులో ప్ర‌యాణం చేయ‌వ‌చ్చు. త‌మ చారిత్రాత్మ‌క మూలాల‌ను ట‌చ్ చేసే రీతిలో ఈ రైలు రూట్‌ను క్రియేట్ ఛేవారు.ఢిల్లీ నుంచి బ‌య‌లుదేరిన రైలు.. ఆ త‌ర్వాత అయోధ్య చేరుకుంటుంది. అక్క‌డ నుంచి పాట్నా, గ‌యా, వారణాసి, మ‌హాబ‌లిపురం, రామేశ్వ‌రం, మ‌ధురై, కొచ్చి, గోవా, ఎక్తా న‌గ‌ర్‌(కేవ‌డియా), అజ్మీర్‌, పుష్క‌ర్‌, ఆగ్రా ప‌ట్ట‌ణాల‌ను ఆ రైలు చుట్టువ‌స్తుంది.

విదేశాంగ శాఖ ప్ర‌కారం.. రైలు టూరుకు చెందిన అన్ని ఖ‌ర్చుల‌ను కేంద్ర ప్ర‌భుత్వ‌మే భ‌రిస్తుంది. ఆయా దేశాల నుంచి ఇండియాకు వ‌చ్చే ప్ర‌వాసీల రిట‌ర్న్ విమాన ఖ‌ర్చులో 90 శాతం కూడా ప్ర‌భుత్వ‌మే పెట్టుకోనున్న‌ది. ప్ర‌యాణికులు కేవ‌లం 10 శాతం ఛార్జీ మాత్ర‌మే చెల్లించాల్సి ఉంటుంది. ఈ రైలులో టూర్ చేసే వారికి 4స్టార్ హోట‌ల్ అకామిడేష‌న్ ఇవ్వ‌నున్నారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870