📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం

ప్రజలు ఆశిస్తారు కాని ఓటు వేయరు: రాజ్ థాకరే

Author Icon By Sukanya
Updated: January 1, 2025 • 8:14 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ థాకరే నూతన సంవత్సర సందేశంలో, మహారాష్ట్ర ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం తన పార్టీని ఆశ్రయిస్తున్నారని, కానీ ఎన్నికల సమయంలో వారిని మర్చిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

“మహారాష్ట్ర ప్రజలు తమ సమస్యలు పరిష్కరించమని మాదెగరకి వస్తారు కానీ ఓటు వేయరు. ఇది కొంత దురదృష్టకరమైన విషయం,” అని థాకరే పేర్కొన్నారు.

రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై తాను ఇంకా పరిశీలనలో ఉన్నానని, త్వరలో పార్టీకి ఒక విస్తృత దిశానిర్దేశం అందజేస్తానని ఆయన చెప్పారు. ఈ ఎన్నికల్లో ఎంఎన్ఎస్ ఒక్క నియోజకవర్గంలో కూడా విజయం సాధించలేకపోవడం వల్ల తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటోంది.

“నిరుద్యోగులకు కులం లేదు. కానీ ప్రజల మధ్య కులాల విభజనను ప్రేరేపించారు. పేద ప్రజల జీవితం ద్రవ్యోల్బణంతో ఇబ్బంది పడుతోంది. రైతులు, కార్మికుల పరిస్థితి దయనీయంగా ఉంది. కానీ ప్రతి సమస్య సమయంలో మా పార్టీనే గుర్తు చేసుకుంటారు. ఓటింగ్ సమయంలో మాత్రం మాకు దూరంగా ఉంటారు,” అని థాకరే తన X పోస్ట్‌లో పేర్కొన్నారు.

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఎన్ఎస్ 125 మంది అభ్యర్థులను పోటీకి నిలిపినా, కేవలం 1.55% ఓట్లతో పరిమితం కావడం గమనార్హం. మహిమ్ నియోజకవర్గంలో థాకరే కుమారుడు అమిత్ పోటీ చేసి మూడో స్థానంలో నిలిచారు, ఇది పార్టీకి గట్టి నిరాశను మిగిల్చింది.

2009లో 13 సీట్లు గెలుచుకున్న ఎంఎన్ఎస్, 2014 మరియు 2019లో ఒక్కొక్క సీటు మాత్రమే సాధించింది.

ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం, పార్టీ హోదా కొనసాగించాలంటే కనీసం ఒక సీటు లేకపోతే ఎనిమిది శాతం ఓట్లు పొందాలి. రెండు సీట్లుంటే ఆరు శాతం, మూడు సీట్లుంటే మూడు శాతం ఓట్లు అవసరం,” అని రాజకీయ విశ్లేషకురాలు పేర్కొన్నారు.

రాజ్ థాకరే మాట్లాడుతూ, ఎన్నికల ఫలితాలను తనకు నమ్మశక్యం కావడం లేదని, పార్టీ భవిష్యత్ కార్యాచరణను ప్రణాళిక చేస్తానని హామీ ఇచ్చారు.

Maharashtra Navnirman Sena (MNS) MNS chief Raj Thackrey

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.