📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్

నిరాహార దీక్షలో ప్రశాంత్ కిషోర్ అరెస్టు

Author Icon By Sukanya
Updated: January 6, 2025 • 8:42 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బీహార్‌లోని పాట్నాలో జన్ సూరాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ ను గాంధీ మైదానంలో నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న సమయంలో పోలీసులు సోమవారం ఉదయం అరెస్టు చేశారు. పోలీసుల సమాచారం ప్రకారం, కిషోర్ ను బలవంతంగా అంబులెన్సులో ఎయిమ్స్కు తరలించి, ఇతర నిరసనకారుల నుండి వేరుచేశారు.

అధికారుల ప్రకారం, ప్రశాంత్ కిషోర్ చికిత్సకు నిరాకరించారు. “మరణం వరకు నేను నిరాహార దీక్షను కొనసాగిస్తాను” అని ఆయన స్పష్టంగా చెప్పారు.

పెద్ద సంఖ్యలో పోలీసులు కిషోర్ను నిరసన స్థలం నుండి తొలగించేందుకు ప్రయత్నించిన దృశ్యాలు ఉన్నాయి వీడియో ఉన్నాయి. కిషోర్ అనుచరులు అతన్ని రక్షించడానికి ప్రయత్నించారు, కానీ పోలీసులు వారిని అక్కడి నుండి తొలగించారు.

ప్రశాంత్ కిషోర్ జనవరి 2 నుండి విద్యార్థుల డిమాండ్లకు మద్దతుగా నిరవధిక సమ్మెలో పాల్గొంటున్నారు. బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (BPSC) నిర్వహించిన 70వ కంబైన్డ్ ప్రిలిమినరీ పరీక్షను రద్దు చేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. పేపర్ లీక్ కారణంగా పరీక్షను రద్దు చేయాలని వారు కోరుతున్నారు.

ఈ సందర్భంలో, కిషోర్ మీడియాతో మాట్లాడుతూ, “మేము దీనిపై హైకోర్టుకు వెళ్తాం. జనవరి 7న పిటిషన్ దాఖలు చేస్తాం. నిరసన కొనసాగించాలా లేదా అనేది మా నిర్ణయం. కానీ మా ఆందోళనలో ఎలాంటి మార్పు ఉండదు,” అని చెప్పారు.

ప్రశాంత్ కిషోర్ నిరసన స్థలానికి సమీపంలో విలాసవంతమైన సౌకర్యాలతో కూడిన ‘వానిటీ వాన్’ నిలిపి ఉండటం వివాదానికి కారణమైంది. ప్రత్యర్థులు ఈ వాహనాన్ని చూపించి, కిషోర్ నిజాయితీపై ప్రశ్నించారు.

ఈ ఆరోపణలకు ఆయన కౌంటరిచేస్తూ, “నిరాహార దీక్షలో ఉన్న నేను బాత్రూమ్ కోసం ఇంటికి వెళితే, తిన్నానని లేదా విశ్రాంతి తీసుకున్నానని కొందరు ఆరోపణలు చేస్తారు. అందుకే వాన్ అవసరమైంది. నేను బస్సులో ఉండనప్పుడు, అది నా నియమాలకు అనుగుణంగా ఉంటుంది,” అన్నారు.

అలాగే, “కొంతమంది వాన్ ఖరీదు 4 కోట్లు అని, 25 లక్షల అద్దెకు తీసుకున్నామని అంటున్నారు. అలా అయితే, ఆ అద్దె నాకిచ్చి చూడండి. ప్రజలు ఎంత వరకు అనవసర ఆరోపణలు చేయగలరో ఇదే ఉదాహరణ,” అని కిషోర్ తెలిపారు.

ప్రశాంత్ కిషోర్ చేపట్టిన ఈ నిరసన విద్యార్థుల డిమాండ్లను గట్టిగా ప్రాతినిధ్యం చేస్తోంది. ఈ నిరసనపై ప్రభుత్వ చర్యలు, కిషోర్ నిర్ణయాలు ఇప్పటికీ చర్చకు కేంద్రబిందువుగా మారాయి.

Arrested In Patna hunger strike for Protesting Students Jan Suraaj Party founder Prashant Kishor

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.