📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

డిసెంబర్ 5న కొలువుదీరనున్న మహారాష్ట్ర సర్కారు..?

Author Icon By Sudheer
Updated: November 30, 2024 • 5:36 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో సుమారు 218 సీట్లతో ‘మహాయుతి’ కూటమి అఖండ విజయం ఖాయమైంది. దీంతో ఓవైపు మహారాష్ట్ర ముఖ్యమంత్రి పీఠం ఈసారి ఎవరిని వరించబోతోందనే చర్చ జరుగుతుండగా, మరోవైపు కొత్త ప్రభుత్వం ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఎప్పుడనే అంశం కూడా తెరపైకి వచ్చింది.

మహారాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 5న కొలువు దీరుతుందని బీజేపీ వర్గాలు తెలిపాయి. సౌత్ ముంబైలోని ఆజాద్ మైదానంలో ‘మహాయుతి’ ప్రభుత్వ ప్రమాణ స్వీకార మహోత్సవం ఉంటుందని తెలిపాయి. బీజేపీ శాసనసభాపక్ష సమావేశం డిసెంబర్ 2 లేదా 3వ తేదీన ఉంటుందని, అప్పుడే ఆ పార్టీ LP నేతను ఎన్నుకుంటుందని చెప్పాయి. అటు శిండే స్వగ్రామంలో ఉండగా, ఫడణవీస్ సీఎం పీఠం విషయంలో ఎలాంటి వివాదాలు లేవని చెప్పారు. ఈ క్రమంలో సీఎం ఎవరనే ఉత్కంఠ కొనసాగుతోంది.

అధికారికంగా సీఎం ఎవరనేది ప్రకటించనప్పటికీ మరో నాలుగైదు రోజుల్లో ముఖ్యమంత్రితో సహా కొత్త ప్రభుత్వం ప్రమాణస్వీకారం చేయనుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. డిసెంబర్ 2వ తేదీన అతిపెద్ద ఈవెంట్‌గా ఈ ప్రమాణోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు చెబుతున్నారు. సీఎం పదవే ప్రధాన అంశంగా ఉండటంతో కూటమి నేతలతో చర్చోపచర్చలు జరుగుతున్నాయని అంటున్నారు.

ముఖ్యమంత్రిగా ఏక్‌నాథ్ షిండేనే కొనసాగించాలని షిండే శివసేన నేతల నినాదంగా ఉండగా, అజిత్ పవార్ ఎన్‌సీపీ వర్గం నేతలు తమ నేతకు సీఎం పట్టం కట్టాలంటూ పోస్టర్లు కూడా వేస్తున్నారు. మరోవైపు, బీజేపీ ప్రచారసారథిగా అత్యధిక ర్యాలీలు నిర్వహించి ఆ పార్టీకి అత్యధిక సీట్లు సాధించిపెట్టడంతో పాటు, కూటమి నేతల విజయానికి కృషి చేసిన దేవేంద్ర ఫడ్నవిస్‌కు సీఎం పదవి ఇచ్చితీరాలని బీజేపీ నేతలు బలమైన వాదన వినిపిస్తున్నారు. కాబోయే సీఎం ఫడ్నవిస్ అంటూ పోస్టర్లు కూడా వెలిసాయి. దీంతో ముఖ్యమంత్రి పదవికి రేసులో దేవేంద్ర ఫడ్నవిస్ ముందు స్థానంలో నిలుస్తున్నారు.

maharashtra new cm The government of Maharashtra

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.