ముకేశ్ అంబానీ, గౌతం అదానీలు భారత వ్యాపారంలో దిగ్గజాలు. బిలియన్ డాలర్ల వ్యాపారంలో తరచుగా వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా భారత కుబేరులు ముకేశ్ అంబానీ, గౌతం అదానీ ఇద్దరూ వంద బిలియన్ డాలర్ల క్లబ్ నుంచి బయటకు వచ్చేశారు. వారి వ్యాపారాలతోపాటు వ్యక్తిగత సంపద విషయంలోనూ ఇద్దరూ సవాళ్లు ఎదుర్కోవడం వల్లే ఈ క్లబ్ నుంచి బయటకు రావాల్సి వచ్చిందని ‘బ్లూమ్‌బర్గ్’ తన కథనంలో పేర్కొంది.
కారణాలు ఇవేనా?
అంబానీ ఎనర్జీ, రిటైల్ వ్యాపారాల ప్రదర్శన అనుకున్నంతగా లేకపోవడం కూడా ఈ క్లబ్ నుంచి బయటకు రావడానికి ఒక కారణమని బ్లూమ్‌బర్గ్ పేర్కొంది. జులైలో అంబానీ సంపద దాదాపు 120.8 బిలియన్ డాలర్లకు చేరుకుంది. అదే సమయంలో అంబానీ తన కుమారుడు అనంత్ వివాహానికి దాదాపుగా 600 మిలియన్ డాలర్లు ఖర్చు చేశారు. అంబానీ ఇటీవల డిజిటల్ ప్లాట్‌ఫాంలు, రిటైల్ బ్రాండ్లపై దృష్టి సారించారు. రిటైల్ వ్యాపారంలో ఇటీవల వృద్ధి, లాభాలు మందగించాయి.
కేసులతో కొత్త చిక్కులు
ఇక, అదానీ విషయానికి వస్తే భారతీయ అధికారులకు ముడుపుల వ్యవహారంలో అమెరికాలో కేసు నమోదైన తర్వాత అదానీ సంపదలో క్షీణత మొదలైంది. ఇటీవల అమెరికాలో ఆదానీలపై కేసు నమోదు కావడంతో ఆయన వ్యాపారంపై ప్రభావం పడనున్నది. జూన్‌లో అదానీ సంపద 122.3 బిలియన్ డాలర్లకు చేరుకుంది. అయితే, అమెరికా ఆరోపణలు, కేసులు, అంతకుముందు హిండెన్‌బర్గ్ నివేదిక నేపథ్యంలో అదానీ సామ్రాజ్యానికి సవాళ్లు ఎదురయ్యాయి. ఫలితంగా ఆయన సంపద 100 బిలియన్ డాలర్ల లోపునకు పడిపోయింది. దీంతో ముకేశ్ అంబానీ, గౌతం అదానీ ఇద్దరూ వంద బిలియన్ డాలర్ల క్లబ్ నుంచి బయటకు వచ్చేశారు.
డాలర్ల క్లబ్ నుంచి అంబానీ, అదానీ ఔట్!
By
Vanipushpa
Updated: December 17, 2024 • 1:33 PM
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.