📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? బంగారం ధర షాక్! ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? బంగారం ధర షాక్!

కేజ్రీవాల్ మరో కీలక హామీ ప్రకటన

Author Icon By Vanipushpa
Updated: January 4, 2025 • 3:13 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

చలికాలంలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు వేడిని పుట్టిస్తున్నాయి. బీజేపీ, అప్ ప్రధాన పార్టీలు హామీల గుప్పిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ మధ్య రాజకీయాలు వేడెక్కుతున్నాయి. బీజేపీ కేవలం ప్రతికూల విమర్శలు, ఇతరులను అవమానించడం ద్వారా మాత్రమే ఎన్నికల్లో గెలవాలనుకుంటోందని, ఆప్ మాత్రం పదేళ్లు చేసిన పనుల ఆధారంగా ఓట్లు కోరుతోందని ఆప్ కన్వీనర్, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.

ఢిల్లీ వాసులు తప్పుడు నీటి బిల్లులు వస్తే వాటిని కట్టవద్దని, ఆప్ ప్రభుత్వం 2025లో తిరిగి అధికారంలోకి రాగానే ఆ బిల్లులను రద్దు చేస్తుందని ఆయన మరో కీలక హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీపై కేజ్రీవాల్ విమర్శలు గుప్పిస్తూ, ఆ పార్టీ ప్రజలకు దూరమైందని, ప్రజాసమస్యల పరిష్కారంలో చిత్తశుద్ధి కొరవడిందని అన్నారు. కాంగ్రెస్, బీజేపీ రెండు ప్రజావిశ్వాసం కోల్పోయినందున వారు కూటమిగా ఏర్పడాలని సూచించారు. ఢిల్లీలో బీజేపీ విపత్తులో ఉందని, ఆ పార్టీకి ముఖ్యమంత్రి అభ్యర్థి కానీ, ఎజెండా కానీ, ఒక విజన్ కానీ లేవని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీపై కేజ్రీవాల్ విమర్శలు గుప్పిస్తూ, ఆ పార్టీ ప్రజలకు దూరమైందని, ప్రజాసమస్యల పరిష్కారంలో చిత్తశుద్ధి కొరవడిందని అన్నారు.

ఓపికతో వేచిచూడండి

”గత పదేళ్లుగా మా ప్రభుత్వం ఢిల్లీలో ఉచిత నీటిని అందిస్తోంది. 12 లక్షలకు పైగా కుటుంబాలకు జీరో వాటర్ బిల్లులు వస్తున్నాయి. అయితే నేను జైలుకు వెళ్లాక ఏమి జరిగిందో నాకు తెలియదు. వాళ్లు ఏదో తప్పు చేశారు. ప్రజలకు వేలు, లక్షల్లో ప్రతినెలా నీటి బిల్లులు వస్తున్నాయి.

తప్పుడు బిల్లులు వస్తున్నాయని అనుకుంటున్న వాళ్లు నీటి బిల్లులు చెల్లించాల్సిన అవసరం లేదని నేను బహిరంగంగా, అధికారికంగా ప్రకటిస్తున్నాను. ఓపికతో వేచిచూడండి. ఎన్నికల తర్వాత ఆప్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తప్పుడు బిల్లులన్నింటినీ రద్దు చేస్తుంది. ప్రజలందరికీ ఇది నా హామీ.. ఇందుకు నేను గ్యారెంటీ” అని కేజ్రీవాల్ తెలిపారు.

Arvind Kejriwal assembly elections delhi

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.