📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

కుంభ మేళాలో టీటీడీ కియోస్క్ ఏర్పాటు

Author Icon By Vanipushpa
Updated: January 15, 2025 • 2:46 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మహా కుంభ మేళా 2025 అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. రెండో రోజు పండగ వాతావరణం నెలకొంది. మకర సంక్రాంతిని పురస్కరించుకుని లక్షలాది మంది భక్తులు ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌ వద్ద గంగా-యమున-సరస్వతి త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలను ఆచరిస్తోన్నారు. కాగా- కుంభ మేళాకు ఉన్న విశిష్టతను దృష్టిలో పెట్టుకుని ప్రయాగ్‌రాజ్‌లో ఏర్పాటు చేసిన శ్రీవారి నమూనా ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. రోజూ వందలాది మంది దర్శించుకుంటోన్నారు.

తిరుమల తరహాలోనే టీటీడీ ఇక్కడ నమూనా ఆలయాన్ని నిర్మించిన విషయం తెలిసిందే. స్వామివారికి నిత్య కైంకర్యాలను శాస్త్రోక్తంగా నిర్వహిస్తోన్నారు అర్చకులు. శ్రీవారి నమూనా ఆలయంలో భక్తులు విరాళాలు సమర్పించడానికి వీలుగా టీటీడీ కీయోస్క్ మిషన్ (సెల్ఫ్ ఆపరేటెడ్ మిషన్) ఏర్పాటు చేసింది. ఈ మిషన్ ద్వారా భక్తులు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఒక రూపాయి నుండి రూ.99,999 వరకు తమకు తోచిన మొత్తాన్ని టీటీడీకి విరాళంగా ఇవ్వవచ్చు. 18వ తేదీన ఉదయం 11 నుండి 12 గంటలకు ఆలయ ప్రాంగణంలో కళ్యాణోత్సవం నిర్వహించనున్నారు.

ఇప్పటికే విదేశీయుల తాకిడి సైతం మొదలైంది. ఈ తెల్లవారు జామున తొలి ఘడియలోనే రష్యాకు చెందిన పలువురు భక్తులు త్రివేణి సంగమ స్నానాన్ని ఆచరించారు. మహా కుంభ మేళాలో పుణ్యస్నానాలను ఆచరించడంలో మకర సంక్రాంతిని అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. దీనితో పాటు మౌని అమావాస్య, వసంత పంచమి, మాఘి పూర్ణిమ, మహా శివరాత్రి.. ఈ నాలుగు పుణ్య ఘడియల్లో తప్పనిసరిగా త్రివేణి సంగమ స్నానం చేయాలంటూ పురాణాల్లో ఉందని సాధువులు చెబుతున్నారు.

Maha Kumbh Mela TTD Uttar Pradesh

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.